చిత్రం :‘ఉన్నది ఒకటే జిందగీ’
నటీనటులు: రామ్ - అనుపమ పరమేశ్వరన్ - లావణ్య త్రిపాఠి - శ్రీవిష్ణు - ప్రియదర్శి - కిరీటి - ఆనంద్ - రాజ్ మాదిరాజు తదితరులు
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: కృష్ణచైతన్య పోతినేని
రచన - దర్శకత్వం: కిషోర్ తిరుమల
కథ:
అభి (రామ్).. వాసు (శ్రీవిష్ణు) బాల్య స్నేహితులు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన అభి.. వాసు స్నేహం వల్ల ఆ బాధలో నుండి బయటపడగలుగుతాడు . వాసు నుండి దూరం కావడం ఇష్టం లేక చదువు కోసం వేరే ఊరు వెళ్లకుండా ఉండిపోతాడు అభి. అంతటి ప్రాణ స్నేహితులు 18 ఏళ్ల తరువాత విడిపోతారు. అసలు వాళ్లిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది ??.. దానికి మహా (అనుపమ పరమేశ్వరన్) కి ఉన్న సంబంధమేంటి.. అన్నది మిగతా కధ.
విశ్లేషణ:
గత ఏడాది "నేను శైలజ" తో తెలిసిన కధనే తనదైన రీతిలో చెప్పి ఆకట్టుకున్న కిశోర్ తిరుమల ఈసారి ఫ్రెండ్ షిప్ నేపధ్యం లో మరోసారి అలాంటి ప్రయత్నమే చేసాడు. చెప్పుకోవడానికి చాలా చిన్న కథ అయినా వీలయినంత ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.
అభి/వాసు మధ్య స్నేహం బలపడే చైల్డ్ హుడ్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. అలాగే అభి-మహా లవ్ ట్రాక్ కూడా బాగుంది. కధనం మరీ నెమ్మదించినట్టు అనిపించినా, వాళ్ళిద్దరూ దగ్గరయ్యే సన్నివేశాలు వర్కవుట్ అయ్యాయి. దానికి తోడు చక్కని విజువల్స్, సంగీతం తోడవడంతో ఆ ఎపిసోడ్ ఆహ్లాదంగా సాగిపోతుంది. ఇక అభి/వాసు/మహా మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ కి దారి తీసే పరిస్థితులు కాస్త సినిమాటిక్ గా అనిపించినా.. అభి ఆ ప్రాబ్లెమ్ ని డీల్ చేసిన తీరు ఆశ్యర్యపరుస్తుంది. ఇద్దరూ కలిసి మహా కి ప్రపోజ్ చేసే సన్నివేశం ఒక పక్క ఫన్నీగా ఉంటూనే ఇద్దరికీ మహా పై ఉన్న ప్రేమతో పాటు వాళ్లిద్దరి స్నేహాన్ని కూడా అంతే బలంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అప్పటిదాకా కాస్త ఊహించినట్టుగానే సాగిన సినిమా ఇంటర్వెల్ ముందు ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది.
సెకండాఫ్ లో సీన్ ఊటీ కి షిఫ్ట్ అయ్యాక చెప్పడానికి పెద్దగా కధ లేకపోవడం తో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. మ్యాగీ పాత్ర చిత్రణ పై దర్శకుడు మరింత శ్రద్ధ వహించాల్సింది. స్నేహితులు ఒకరిని ఒకరు గట్టిగా నిలదీస్తే ముగిసిపోయే సమస్య కాబట్టి దర్శకుడు కాస్త కామెడీ తో టైం పాస్ చేద్దామనుకున్నాడు. ఈ క్రమం లో ప్రియదర్శి & ఫ్రెండ్స్ కామెడీ బాగానే వర్కవుట్ అయింది. అలాగే అభి/వాసు మధ్య సన్నివేశాలు కూడా.. ఐతే క్లైమాక్స్ కి ముందు వచ్చే చిన్న ట్విస్ట్, ఆ తరువాత వచ్చే సన్నివేశం సినిమా ని నిలబెట్టాయి.
అభి పాత్ర లో రామ్ నటన బాగుంది. వాసు గా శ్రీ విష్ణు ఆ పాత్రకి సరిపోయాడు. ముఖ్యమైన సన్నివేశాల్లో అతని వాయిస్ బాగా ప్లస్ అయింది. లావణ్య త్రిపాఠి పరవాలేదు. ప్రియదర్శి,కిరీటి బాగానే నవ్వించారు. ఆనంద్.. తదితరులు ఒకే. అందరికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనుపమ పరమేశ్వరన్ గురించి, సినిమాలో రెండు ప్రధాన పాత్రల తరువాత అంత ఇంపార్టెన్స్ తో పాటు స్కోప్ ఉన్న క్యారెక్టర్ ని సమర్ధవంతంగా పోషించింది.
దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమా కి మరో ప్లస్ పాయింట్. పాటలు అన్ని సినిమా లో చక్కగా కుదిరాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కిశోర్ తిరుమల దర్శకుడిగా కంటే రచయిత గానే ఎక్కువ రాణించాడు. ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ చేద్దామన్న ప్రాసెస్ లో కొంచెం కంట్రోల్ తప్పినా సినిమా ఆసాంతం తన మార్కు డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. "నువ్వంటే ఎంత ఇష్టమంటే నీ కోసం నిన్ను కూడా వదులుకునేంత" లాంటి కొటేషన్ ల తో పాటు" రాకపోవడం నా తప్పైతే.. పిలవకపోవడం నీ తప్పు" లాంటి సహజమైన సంభాషణలు ఆకట్టుకుంటాయి. \
రేటింగ్: 6.5/10
0 comments:
Post a Comment