రివ్యూ: మజిలీ
బ్యానర్: షైన్ స్క్రీన్స్
తారాగణం: నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావురమేష్, సుహాస్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: గోపి సుందర్
నేపథ్య సంగీతం: తమన్
కూర్పు: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: విష్ణుశర్మ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
తోలి చిత్రం "నిన్ను కోరి" తోనే అభిరుచి గల దర్శకుడు గా ఆకట్టుకున్న శివ నిర్వాణ ఈసారి ఆ తరహా లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ నే కాస్త భిన్నమైన నేపథ్యం లో చెప్పే ప్రయత్నం చేసాడు..
'దేర్ ఈజ్ లవ్... దేర్ ఈజ్ పెయిన్' అన్న టాగ్ లైన్ కి తగ్గట్టు సినిమా లో అటు ప్రేమ కు.. ఆ ప్రేమ కోల్పోయిన కారణంగా హీరో అనుభవించే బాధ కు తగిన ప్రాధాన్యత ని ఇస్తూ కధని నడిపించాడు దర్శకుడు. మొదటి సన్నివేశం నుండి చివరి వరకు మన ఆలోచనలకు అనుగుణంగానే కధనం సాగినా, లీడ్ పెయిర్ తో పాటు ఇతర పాత్రల ను సరిగ్గా తీర్చిదిద్దడం లో దర్శకుడు విజయం సాధించాడు.
ఫస్టాఫ్ లో వైజాగ్/క్రికెట్ నేపథ్యం లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ చక్కని ఫీల్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది. పూర్ణ.. తండ్రి/స్నేహితుల మధ్య సన్నివేశాలు మంచి కామెడీ పండిస్తే, పూర్ణ-అన్షు లవ్ ట్రాక్ అంతే ఆహ్లాదంగా ఉంటుంది. సరదా సరదా గా,కాస్త వేగంగానే కధనం నడవడం వల్ల ఫస్టాఫ్ తొందరగానే అయినట్టు అనిపిస్తుంది.
ఇంటర్వెల్ వద్దే సెకండాఫ్ ముందు ఎలా ఉండబోతుంది అన్న అంచనా కు వచ్చేసినా కధనం కూడా కాస్త నెమ్మదించినా .. పాత్రల మధ్య ఎమోషన్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. సెంటిమెంట్/ఎమోషన్స్ ప్రధానంగా నడిచే సెకండాఫ్ కు సమంత పాత్రే బలం. పూర్ణ ను మౌనంగా ప్రేమించే ప్రియురాలి నుండి గతం మరచిపోలేక అక్కడే ఆగిపోయిన అతడు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలి అని ఆశించే భార్య గా ఆమె క్యారెక్టర్ జర్నీ మొత్తం "ప్రియతమా" సాంగ్ లో చూపించిన తీరుకు దర్శకుడి కి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.
పూర్ణ గా నాగ చైతన్య కి చాలా మంచి రోల్ లభించింది.. టీనేజ్ ఎపిసోడ్ లో ఒకటి రెండు చోట్ల తప్ప తన నటన బాగుంది. అలాగే సెకండాఫ్ లో భగ్న ప్రేమికుడి పాత్ర లో కూడా తనదయిన ముద్ర వేసాడు. శ్రావణి పాత్రలో సమంత నటన అద్భుతం..ముఖ్యంగా క్లైమాక్స్ లో వీళ్లిద్దరి నటన పతాక స్థాయి లో ఉంది.కొత్త అమ్మాయి దివ్యాంశ కౌశిక్ కూడా బాగానే చేసింది. రావు రమేష్ పోసాని తండ్రి పాత్రలకు సరిగ్గా సరిపోయారు. స్నేహితుడి పాత్రలో సుహాస్ బాగా చేసాడు. అతుల్ కులకర్ణి సుబ్బరాజు తదితరులు పరవాలేదు. గోపి సుందర్ అందించిన పాటలు వినసొంపుగా లేకున్నా సినిమా లో ఇమిడిపోయాయి.థమన్ నేపధ్య సంగీతం చాలా బాగుంది.
దర్శకుడి గా ఎమోషన్స్ పండించడం లో తనదైన శైలి కనబర్చిన శివ నిర్వాణ.. సెకండాఫ్ లో వచ్చే డెహ్రాడూన్ ఎపిసోడ్ ..పూర్ణ-శ్రావణి జీవితం లో మీరా ప్రవేశించే ఎపిసోడ్ పై మరింత శ్రద్ధ వహించి ఉండాల్సింది. అప్పటిదాకా సహజంగా సాగిన సినిమా ఆ ఎపిసోడ్ తరువాతే కాస్త కన్వీనియంట్ రూట్ లో వెళ్తుంది. ఈ ఒడిదుడుకులు లేకుండా ఉండి ఉంటే మజిలీ ప్రయాణం మరింత సాఫీగా సాగేది.
రేటింగ్: 63/100
0 comments:
Post a Comment