తొలి ప్రేమ రివ్యూ


Image result for varun tej tholiprema wallpapers


చిత్రం : ‘తొలి ప్రేమ’ 

నటీనటులు: వరుణ్ తేజ్ - రాశి ఖన్నా - ప్రియదర్శి - సుహాసిని - నరేష్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
రచన - దర్శకత్వం: వెంకీ అట్లూరి


కథ-కథనం - విశ్లేషణ: 

కధగా చెప్పాలంటే మూడు దశల్లో సాగే  ఒక ప్రేమ జంట కధ. ఇంతకుముందు రాని కధ ఐతే కాదు కానీ ఆ కధకి తనదైన ముద్ర వేయడం లో దర్శకుడు వెంకీ అట్లూరి సఫలమయ్యాడు.

హీరో-హీరోయిన్ పరిచయం అయ్యే మొదటి ఎపిసోడ్ మామూలుగానే మొదలైనా నిన్నిలా చూసానే పాట నుంచి సరైన ట్రాక్ లో పడుతుంది సినిమా . ఇక ఆ తరువాత
సీన్ కాలేజీ కి షిఫ్ట్ అయ్యాక దర్శకుడు చెలరేగిపోయాడు. ఇద్దరూ దగ్గరయ్యే సన్నివేశాలని కొత్తగా ప్రెజంట్ చేస్తూ మంచి ఫీల్ తో నడిపించాడు. హీరోయిన్ ప్రపోజ ల్ సీన్,కార్ లో తొలి ముద్దు సీన్ ఆకట్టుకుంటాయి.. ఆ తరువాత కాలేజీ లో ఫైట్ , .. ఆ తరువాత ఇద్దరూ గొడవ పడి విడిపోవడానికి దారి తీసే ఎమోషనల్‌ సీన్ తో   హై నోట్ లో ఎండ్ చేసి ఆకట్టుకుంటాడు.

ఇక సెకండాఫ్ చాలా సినిమాల్లాగే ఊహించదగ్గ సెటప్ లో హీరో-హీరోయిన్ ల ప్యాచ్ అప్ సెట్ చేసుకున్నాడు. ఇద్దరు ఒకే చోట ఉండవలసి రావడం.. కలిసి పని చేయాల్సి రావడం ఆ వ్యవహారం అంత కాస్త రొటీన్ గానే అనిపిస్తుంది. ఒక వైపు ఫ్రెండ్స్ ట్రాక్ ద్వారా కామెడీ బాగానే అనిపించినా..ప్రేమికుల మధ్య ఉండాల్సిన ఇంటెన్సిటీ కాస్త మిస్ అవుతుంది. ఐతే హీరోయిన్ బర్త్డే సీన్.. అలాగే నరేష్ తో పెళ్లి గురించి మాట్లాడే సీన్,సింపుల్ గా ముగిసిపోయే క్లైమాక్స్ తో అయినా మళ్ళీ ఫీల్ ని రప్పిస్తాడు దర్శకుడు.

వరుణ్ తేజ్ కాన్ఫిడెంట్ గా కనిపించడమే కాకుండా పాత్రకి తగ్గట్టు నటించి ఆకట్టుకుంటాడు. రాశి ఖన్నా కి చక్కని పాత్ర దక్కింది.. తన నటన కూడా బాగుంది.  నటన తో పాటు పెయిర్ గా ఇద్దరు  బాగా కుదిరారు. విద్యురామన్ కామెడీ బాగుంది. అలాగే ప్రియదర్శి,హైపర్ ఆది వీలయినంత నవ్వించారు. నరేష్ చిన్న పాత్రైనా ఉనికిని చాటుకుంటాడు. తల్లి పాత్రలో సుహసిని ఒకే.

రచయిత గా, దర్శకుడి గా తోలి సినిమాతో వెంకీ అట్లూరి ఆకట్టుకుంటాడు. అటు హీరో-హీరోయిన్ ఎవరి ప్లేస్ లో వాళ్ళు కరెక్ట్ అనేలా పాత్రలని మలచడం బాగుంది. అతనికి తన సంగీతం తో మంచి సపోర్ట్ ఇచ్చాడు తమన్, పాటలు అన్నీ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా.

రేటింగ్: 6.5/10
Share on Google Plus

About aditya

Hai i am Aditya, a die hard telugu cinema fan and Critic,I watch almost all the telugu released on the first day and i will share my review in this blog

0 comments:

Post a Comment