చిత్రం :‘రాజా ది గ్రేట్’
నటీనటులు: రవితేజ - మెహ్రీన్ - రాధిక శరత్ కుమార్ - రాజేంద్ర ప్రసాద్ - శ్రీనివాసరెడ్డి - సంపత్ - ప్రకాష్ రాజ్ - సాయికుమార్ - పోసాని కృష్ణమురళి - అన్నపూర్ణ తదితరులు
ఛాయాగ్రహణం: మోహనకృష్ణ
సంగీతం: సాయికార్తీక్
నిర్మాతలు: దిల్ రాజు - శిరీష్
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: అనిల్ రావిపూడి
కథ:
రాజా (రవితేజ) పుట్టుకతోనే అంధుడు. కానీ రాజా తల్లి అతడికి సకల విద్యలూ నేర్పిస్తుంది. అతణ్ని కళ్లున్న వాళ్లకంటే చురుగ్గా తయారు చేస్తుంది. ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ఉండే రాజాకు పోలీస్ కావాలన్నది లక్ష్యం. కానీ అంధత్వం వల్ల అది కుదరదు. ఐతే పోలీస్ ఆపరేషన్లో అయినా తన వంతు పాత్ర పోషించాలన్న పట్టుదలతో ఉున్న రాజాకు ఓ అవకాశం వస్తుంది. లక్కీ (మెహ్రీన్ కౌర్) అనే అమ్మాయిని ఓ పెద్ద గూండా నుంచి కాపాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంతకీ లక్కీ సమస్య ఏంటి.. ఆమె గతమేంటి.. ఆమెను రాజా ఎలా కాపాడాడు.. అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
హీరోయిన్ కి విలన్ వల్ల ప్రాణాపాయం ఉండడం, ఎవ్వరు తోడు లేని ఆమెకి హీరో అన్ని తానయి కాపాడడం.. ఇలాంటి కథతో చాలా సినిమాలే వచ్చాయి.. కథాపరంగా చూసుకుంటే రొటీనే. అలాగే కధనం కూడా పెద్ద ఊహించలేని విధంగా ఎం లేదు. కాకపోతే ఎంటర్టైన్మెంట్ అనే డోస్ ని పర్ఫెక్ట్ గా దట్టిస్తే కధ కొత్తదా, పాతదా ?? లేదు ఇతర లాజిక్ ల గురించి ప్రేక్షకుడు పట్టించుకోడు.
దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ ఐంది ఇక్కడే. హీరో అంధుడు అనగానే ఏదో సెంటిమెంట్ సెటప్ లో హీరో చుట్టూ సింపతీ చూపించే సన్నివేశాలు కాకుండా ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఆ క్యారెక్టర్ ని ప్రెజంట్ చేసాడు.
సినిమా మొత్తానికి ఎమోషనల్ థ్రెడ్ గా రన్ అవ్వాల్సిన ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ ని మరీ మామూలుగా తెరకెక్కించాడు దర్శకుడు. హీరో ఇంట్రో తరువాతే సినిమా లో చలనం వస్తుంది. అక్కడి నుండి సీన్ డార్జీలింగ్ కి షిఫ్ట్ అయ్యాక, రాజేంద్ర ప్రసాద్ అండ్ కో తో సీన్స్ కూడా నవ్విస్తాయి. బ్యాంకు రాబరీ ఎపిసోడ్ కొంచెం సిల్లీగా అనిపించినా హీరో కి ఉన్న లోపాన్నిభలే వాడుకున్నాడు దర్శకుడు. ఇక హీరోయిన్ తో స్నేహం బలపడే ఎపిసోడ్ కూడా పెద్ద లాగ్ లేకుండా వెళ్ళిపోతుంది. షరా మామూలు గా మంచి ఎలివేషన్ ఫైట్ తో ఇంటర్వెల్ బాంగ్. పటాస్ లో 108 ఐడియా, సుప్రీమ్ లో "జింగ్ జింగ్ అమేజింగ్" తరహాలో ఈ సినిమా లో "ఇట్స్ లాఫింగ్ టైమ్ హుహుహూహూ" అనే ఒక చిత్రమైన మేనరిజం బాగుంది. బ్యాంకు రాబరీ ఎపిసోడ్ లోఎలాగైతే హీరో లోపాన్ని కామెడీ కి వాడుకున్నాడో , అలాగే అదే ఎలిమెంట్ ని విలన్ తో సీన్స్ లో ఎలివేషన్ కి కూడా అంతే సక్సెఫుల్ గా అప్లై చేసాడు. సెకండాఫ్ లో హీరో ఆడవాళ్ళ తో కలిసి పోసాని, ప్రభాస్ శీను గ్యాంగ్ ల భరతం పట్టే ఎపిసోడ్ కూడా బాగుంది.
హీరో తన బలం ఏంటో విలన్ కి తెలిపే సీన్ బాగా వచ్చింది. దానికి విలన్ రియాక్ట్ అయ్యే తీరు టిపికల్ గానే అనిపించినా, హీరో బలానికి చెక్ పెట్టేందుకు అదొక మంచి అవకాశం లా సినిమాకి ఉపయోగపడేది, ఐతే దర్శకుడు ఈ ఎపిసోడ్ ని అంత బాగా హ్యాండిల్ చేయలేకపోయాడు. ట్రైన్ సీన్ అబ్బో అనిపించినా, ఆ తరువాత హీరో అమ్మ ఆచూకీ కనిపెట్టేందుకు వేసే చిన్న ట్రిక్ ఇచ్చిన కిక్ ఆ మునుపటి సీన్ ఇవ్వలేకపోయింది. హీరో కి విలన్ ఎదురుపడ్డ మరుక్షణం ఫైట్ కి తప్ప వేరే థాట్ కి ఛాన్స్ ఏ లేదు. అందుకనే హీరో-విలన్ ఎదురుపడడం కాస్త లేట్ చేసాడు దర్శకుడు, దాని వల్లే సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది సెకండాఫ్ లో. విలన్ పాత్ర కి ఉన్న పొలిటికల్ లింక్ ని సరిగ్గా వాడుకుని..అతడి ప్లాన్ లని హీరో బుద్ది బలం తో ఎదురుకున్న తరహాలో కధని నడిపి ఉంటే బాగుండేది. చివర్లో క్లైమాక్స్ రెండు సార్లు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.
రవితేజ తనదైన ఎనర్జీ తో మరోసారి ఆకట్టుకుంటాడు. మెహ్రీన్ బొద్దుగా చూడ్డానికి బాగానే ఉన్నా, నటనలో తేలిపోయింది. విలన్ గా వివాన్ భాటేనా బాగానే చేసాడు కానీ లిప్ సింక్ చాలా చోట్ల మిస్ అయ్యాడు. రాధిక, శ్రీనివాస రెడ్డి బాగానే చేసారు. తనికెళ్ళ భరణి వీలయినంత నవ్వించాడు. రాజేంద్ర ప్రసాద్ పృథ్వీ కామెడీ కూడా ఒకే. ప్రకాష్ రాజ్ ,సంపత్, సాయి కుమార్ తదితరులు పరవాలేదు.
సాయి కార్తిక్ అందించిన పాటల్లో టైటిల్ సాంగ్, చివర్లో వచ్చే సాంగ్ బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. దర్శకుడిగా అనిల్ రావిపూడి ఆద్యంతం ఎక్కడ పడితే అక్కడ కామెడీ ని ఇన్సర్ట్ చేసి నవ్వించడం లో సక్సెస్ అయినా,హీరో పాత్ర కి ఉన్న లోపాన్ని దృష్టి లో ఉంచుకుని కొన్ని చోట్ల అయినా, కాస్త లాజిక్ ని పట్టించుకుని యాక్షన్ పార్ట్ ని బాలన్స్ చేయడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది.
రేటింగ్: 6/10
0 comments:
Post a Comment