మహర్షి రివ్యూ


Image result for maharshi wallpapers


రివ్యూ: మహర్షి
బ్యానర్‌: వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా
తారాగణం: మహేష్‌, పూజహెగ్డే, అల్లరినరేష్‌, జగపతిబాబు, రావురమేష్‌, వెన్నెలకిషోర్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
రచన: వంశీ పైడిపల్లి, హరి, సోలమన్‌
ఛాయాగ్రహణం: కె.యు. మోహనన్‌
నిర్మాతలు: అశ్వనీదత్‌, దిల్‌ రాజు, పరమ్‌ వి. పొట్లూరి, పర్ల్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నే
దర్శకత్వం: వంశీ పైడిపల్లి


మహేష్ బాబు 25వ సినిమా గా, కావాల్సిన అన్ని హంగు ఆర్భాటాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మహర్షి’. కమర్షియల్ సినిమా అందిస్తూనే అందులో ఒక ఉదాత్తమైన సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.

ప్రచారం లో భాగంగా చాలా సార్లు  "జర్నీ అఫ్ రిషి" అనే పాయింట్  ని స్ట్రెస్ చేసిన దర్శకుడు.. ఆ లైన్ కి తగ్గట్టు గానే కధను అల్లుకున్నాడు. సీఈఓ గా హీరో ఎంట్రీ.. ఆ పై అతని పయనం అక్కడికి ఎలా మొదలయిందో చూపించే గతం,ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కాలేజ్ ఎపిసోడ్ ఏ దాదాపు ఫస్టాఫ్ ని ఆక్రమించేసింది. ఆ పై చిన్న ట్విస్ట్ తో హీరో అంతర్మధనం మొదలవడం తో ముగుస్తుంది. ఇక సెకండాఫ్ లో సీన్ రామవరం కి షిఫ్ట్ అయ్యాక అసలు కధ మొదలవుతుంది. స్నేహితుడు ఏమయ్యాడో అన్న ప్రశ్న తో మొదలయి అటు నుంచి ఊరి సమస్యలు ఆ పై రైతు లకు అందాల్సిన సహాయం,ఇవ్వాల్సిన గౌరవం దగ్గరకు వచ్చి ఎండ్ అవుతుంది.

కాలేజీ ఎపిసోడ్ కే ఎక్కువ సమయం కేటాయించడంతో ఫస్టాఫ్ లో అసలు కధను టచ్ చేసే ఛాన్స్ లేకుండా చేసుకున్నాడు దర్శకుడు.. పాత్రల పరిచయం నుండి మంచి ఎంటర్టైనింగ్ గా సాగే ఆ ఎపిసోడ్ ని ముగించే క్రమం లో మాత్రం కాస్త తడబడ్డాడు దర్శకుడు. స్నేహం/ప్రేమ ని హీరో వదులుకునే సన్నివేశాలు అంత బలంగా లేవు.  ఐతే ఫ్లాష్ బ్యాక్ ముగిసే సమయం లో మాత్రం బలమైన సన్నివేశాలు పడ్డాయి. హీరో-తండ్రి లెటర్ సీన్.. అలాగే తన ఎదుగుదల కు అసలు కారణం తెలుసుకునే ట్విస్ట్ కూడా బాగా వర్కవుట్ ఐంది. కాకపోతే ముందుగా  చెప్పుకున్నట్టు అసలు కథలోకి రావడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. దాంతో సెకండాఫ్ లో ఒకేసారి అన్నిసబ్  ప్లాట్స్ అంతే బలంగా హీరో జర్నీ లో ఇమిడిపోయేలా చేయడం లో విఫలమయ్యాడు. మళ్ళీ కొత్త గా సినిమా మొదలైన తరహా లో ఉంటుంది వ్యవహారం.. అసలు నిజం తెలుసుకుని హీరో స్నేహితుడు వద్దకు వచ్చాక కాసేపు హీరో బ్యాక్ సీట్ తీసుకుంటాడు..

ఆ పై వచ్చే ఆఫీస్ ఎపిసోడ్ కాస్త గందరగోళంగానే ఉంటుంది. ఐతే స్నేహితుడి మీద ఎటాక్ జరిగే ఎపిసోడ్ నుండి మళ్ళీ కధనం ఊపందుకుంటుంది. హీరో నే డైరెక్ట్ గా రంగం లోకి దిగడం.. ఆ పైన ముసలాయన తో సీన్ నుండి రైతుల సమస్యల మీదకి దృష్టి మళ్లడం ఈ ఎపిసోడ్స్ అన్ని బాగా వచ్చాయి. విలన్ పని సింపుల్ గా కానిచ్చేసిన తరువాత చివర్లో వచ్చే పాట మంచి ఫీల్ తో సినిమాని ముగిస్తుంది.

నటుడిగా మహేష్ కి పెద్ద పరీక్ష పెట్టే పాత్ర ఏమి కాదు, తన వరకు పూర్తి న్యాయం చేసాడు, ఎమోషనల్ సీన్స్ లో ఎప్పటిలానే రాణించాడు. అల్లరి నరేష్ కి మంచి  పాత్ర లభించింది,అతని నటనా బాగుంది. పూజ హెగ్డే కి సరైన ప్రాధాన్యత లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కాస్త స్క్రీన్  ప్రెజన్స్ లభించినా, తరువాత మాత్రం నామమాత్రపు పాత్రగా మిగిలిపోతుంది. జగపతి బాబు రొటీన్ విలన్ క్యారెక్టర్ లో ఒకే అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్, జయసుధ ల పాత్ర ల నిడివి తక్కువైనా ఉన్నంతలో బాగానే చేసారు. రావు రమేష్ - సాయికుమార్ - పోసాని-రాజీవ్ కనకాల ఆయా పాత్రలకు సరిపోయారు.వెన్నెల కిశోర్,శ్రీనివాస రెడ్డి తదితరులు పరవాలేదు.

మొత్తానికి దర్శకుడు వంశీ పైడిపల్లి ఉద్దేశం మంచిదే అయినా,సుదీర్ఘంగా సాగే రిషి ప్రయాణం ని కాస్త ఒడి దుడుకుల మీదుగానే సాగింది అని చెప్పాలి. ముఖ్యమైన సన్నివేశాలు, పాత్రల ను ప్రధాన కధలో సరిగ్గా సమకూర్చే విషయం పై  శ్రద్ధ వహించి ఉంటే,సాధారణ స్థాయి ని దాటి మరింత మంచి అనుభూతిని కలిగించేది 'మహర్షి'.


రేటింగ్: 58/100



Share on Google Plus

About aditya

Hai i am Aditya, a die hard telugu cinema fan and Critic,I watch almost all the telugu released on the first day and i will share my review in this blog

3 comments: