నటీనటులు: నిఖిల్-సిమ్రాన్ పరీంజా-సంయుక్త హెగ్డే-రాకేందు మౌళి-బ్రహ్మాజీ-సిజ్జు-హేమంత్-షాయాజి షిండే తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ: రిషబ్ శెట్టి
స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ
మాటలు: చందూ మొండేటి
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
కథ-కథనం-విశ్లేషణ:
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే తెలుగు ప్రేక్షకులకి పదేళ్ల కిందట వచ్చిన "హ్యాపీ డేస్" సినిమా గుర్తుకువస్తుంది. ఆ సినిమా తో పాటు ప్రేమమ్, 3 ఇడియట్స్ లాంటి సినిమాలు/పాత్రలు గుర్తుకు తెస్తుంది"కిర్రాక్ పార్టీ" (కన్నడ లో విజయం సాధించిన "కిరిక్ పార్టీ" రీమేక్).
ఈ తరహా సినిమాలకు చెప్పుకోదగ్గ కధ లేకపోయినా, రిలేట్ చేసుకునే క్యారెక్టర్స్ ,సిట్యుయేషన్స్ ఉంటే చాలు. ఐతే సెటప్ వరకు చక్కగా కుదిరిన సినిమాని అంతే ఎఫెక్టివ్ గా తెరకెక్కించలేకపోయాడు దర్శకుడు శరణ్. పాత్రల పరిచయం,కాలేజీ లో సీనియర్/జూనియర్ గొడవలు, లెక్చరర్స్ తో అల్లరి వంటి సరదా సన్నివేశాలు బాగానే సాగిపోయినా, ముఖ్యమైన కృష్ణ-మీరా లవ్ ట్రాక్ ని మరింత బలంగా తీర్చి దిద్దాల్సింది. ఇంటర్వెల్ వద్ద ట్విస్ట్ ,తరువాత సన్నివేశం లో హీరో రగిలిపోయి రియాక్ట్ అయ్యే ఎపిసోడ్ బాగుంది. ఐతే అక్కడ హీరో ఎందుకు రియాక్ట్ అయ్యాడో క్లారిటీ ఉంటుంది తప్ప ప్రేక్షకుడు ఆ ఎమోషన్ ను ఫీల్ అయ్యేలా సాగుతుంది అంతకు ముందు నడిపిన వ్యవహారం. ఒరిజినల్ ని యధాతధంగా ఫాలో అయ్యారో, లేదా మార్పులు ఎక్కువ చేసారో తెలియదు కానీ అటు ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్ తో పాటు, సెకండాఫ్ లో హీరో పాత్రకి ఉండాల్సిన సంఘర్షణ, అతను పడే బాధను సరైన విధంగా చూపించలేదు. ఆ పై సినిమా సీరియస్ టర్న్ తీసుకుంటుంది అనుకుంటే కేవలం హీరో పాత్ర కాస్త మారుతుంది తప్ప మిగతా అంత మళ్ళీ ఫస్టాఫ్ లో లాగే సరదా సన్నివేశాలతో సాగిపోతుంది. ఆ సాగతీత చివరికి ఎటు వెళుతుందో అర్ధం కాదు ఒక దశలో. ఐతే చివరి అరగంటని మాత్రం బాగానే హ్యాండిల్ చేసాడు దర్శకుడు. ప్రతి సన్నివేశం ఊహించదగ్గదే అయినప్పటికీ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి.
నిఖిల్ నటన బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ లో,క్లైమాక్స్ కి ముందు సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. సిమ్రాన్ పరీంజా క్యూట్ లుక్స్/ స్మైల్ తో అందంగా ఉంది. సంయుక్త హెగ్డే అల్లరి పిల్ల తరహా పాత్రకి సరిపోయింది. హీరో ఫ్రెండ్స్ గా రాకేందు మౌళి,మిర్చి హేమంత్ & గ్యాంగ్ బాగానే చేసారు. ప్రిన్సిపాల్,లెక్చరర్ గా చేసిన అతని తో పాటు బ్రహ్మాజీ-సిజ్జు-హేమంత్-షాయాజి షిండే తదితరులు ఆయా పాత్రలకు సరిపోయారు.
పాటలు బాగానే ఉన్నాయి . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కాలేజీ లైఫ్ ని గుర్తుకు తెచ్చే నోస్టాల్జిక్ మూమెంట్స్ ,ఫన్నీ సీన్స్ వరకు మేనేజ్ చేసిన దర్శకుడు ఎమోషన్స్ విషయం లో మరింత శ్రద్ధ వహించి ఉండి ఉంటే బాగుండేది.
రేటింగ్ : 5.5/10
0 comments:
Post a Comment