చిత్రం : ‘ఆనందో బ్రహ్మ’
నటీనటులు: తాప్సి - శ్రీనివాసరెడ్డి - వెన్నెల కిషోర్ - షకలక శంకర్ - తాగుబోతు రమేష్ - రాజీవ్ కనకాల - రాజా రవీంద్ర - విజయ్ చందర్ - సుప్రీత్ - తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: కృష్ణకుమార్
ఛాయాగ్రహణం: అనీష్ తరుణ్ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి
రచన - దర్శకత్వం: మహి కె.రాఘవ్
కథ:
ఒక పెద్ద ఇంటిని అమ్మకానికి పెడితే అందులో దయ్యాలున్నాయన్న భయంతో ఎవరూ కొనడానికి ముందుకు రారు.దాంతో ఓ నాలుగు రోజులు ఆ ఇంట్లో ఉండి ఏ దయ్యాలు ఆ ఇంట్లో లేవని నిరూపిస్తానని ఓనర్ (రాజీవ్ కనకాల) ని ఒప్పిస్తాడు సిద్ధూ (శ్రీనివాస రెడ్డి), తనతో పాటు మరో ముగ్గురిని (వెన్నెల కిషోర్, రమేష్, శంకర్) వెంట తీసుకెళ్తాడడు. మరి ఆ తరువాత వాళ్ళకి ఎదురైనా పరిస్థితులు ఏంటి?? నిజంగానే ఆ ఇంట్లో దయ్యాలున్నాయా...అన్నది మిగతా కధ.
కథనం - విశ్లేషణ:
హారర్ కామెడీ అనగానే ఒక పెద్ద బంగ్లా,అందులో ఓ దెయ్యం,తనని చంపిన వాళ్ళని లేదా తనకి అన్యాయం చేసిన వాళ్ళని చంపేందుకు కాచుకుని ఉండడం.. ఈ తరహా ఫార్ములాతో చాలా సినిమాలే వచ్చాయి. ఆనందో బ్రహ్మ నేపథ్యం కూడా అలాంటిదే అయినా, భయానికి నవ్వంటే భయం అనే టాగ్ లైన్ తో, మనుషుల్ని చూసి దెయ్యాలే భయపడతాయి అన్నకొత్త కాన్సెప్ట్ తో కాస్త ఆసక్తిని రేకెత్తించింది.
నిజానికి సినిమా ఆరంభం చాలా బాగుంది. దయ్యాలు/మనుషులని మార్చి చూపించే మొదటి ఎపిసోడ్ తో ఆసక్తికరంగా మొదలైన ఫస్టాఫ్ ఆ తరువాత ప్రధాన పాత్రల పరిచయం,వాటి నేపధ్యం చూపించేందుకు ఎక్కువ సమయం తీసుకోడవంతో కాస్త బోర్ కొడుతోంది. ఆయా పాత్రలకు ఉన్న సమస్యలతో అంతగా కామెడీ కూడా పండలేదు. అందరు ఒక చోటకి చేరి ఇంట్లో అడుగు పెట్టే ఇంటర్వెల్ సన్నివేశం తోటే అసలు కధ మొదలవుతుంది.
ఒక్కో పాత్రకి ఉన్న బలహీతనే దయ్యాలు భయపడ్డానికి,అయోమయం లో పడడానికి వాడుకున్న తీరు బాగుంది. షకలక శంకర్ తో దయ్యాలకి ఉన్న అన్ని సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా జల్సా స్పూఫ్ సీన్ అదిరిపోయింది . అలాగే వెన్నెల కిశోర్/తాగుబోతు రమేష్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఐతే చివర్లో ఒక్కో పాత్రకి బలహీనతలు దూరమై దయ్యాలకి భయపడే ఎపిసోడ్ ని సరిగ్గా తెరకెక్కించలేదు. ఇమ్మీడియేట్ గా క్లైమాక్స్ కి వెళ్ళిపోయాడు దర్శకుడు. అక్కడ రెగ్యులర్ గా దయ్యాలకి ఉండే బ్యాక్ స్టోరీ/ట్విస్ట్ పరవాలేదు అనిపించింది.
దర్శకుడు మహి మహి వి. రాఘవ్ ఎంచుకున్న కోర్ కాన్సెప్ట్ బాగానే ఉన్నా, ప్రధాన పాత్రల పరిచయాన్ని కాస్త కుదించి,సినిమా ముగింపు విషయం లో ఇంకొంత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
నటీనటులు:
తాప్సి ప్రధాన పాత్ర పోషించినప్పటికీ పెద్దగా నటనకు స్కోప్ లేదు .ఆ పాత్రకి సరిపోయింది. శ్రీనివాసరెడ్డి మరోసారి తనదైన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్ కూడా సింపుల్ గా ఎటువంటి హడావిడి లేని కామెడీ తో అలరించాడు. ఇక షకలక శంకర్ కామెడీ సినిమాకే హైలైట్ గా చెప్పుకోవచ్చు. తాగుబోతు రమేష్ కూడా తనకు అలవాటని పాత్రనే కాస్త భిన్న నేపధ్యం లో చేసి అలరించాడు. రాజీవ్ కనకాల.. విజయ్ చందర్ బాగా చేశారు.రాజా రవీంద్ర.. తదితరులు ఒకే.
సాంకేతిక వర్గం:
కెమెరా వర్క్ చాలా బాగుంది. దాదాపు సినిమా అంతా ఒకే ఇంట్లో జరిగే కధ అయినప్పటికీ ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా చేయడం లో అనీష్ తరుణ్ కుమార్ సక్సెస్ అయ్యాడు. అలాగే కృష్ణకుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.
రేటింగ్: 6/10
0 comments:
Post a Comment