చిత్రం : ‘జయ జానకి నాయక’
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ - రకుల్ ప్రీత్ - జగపతిబాబు - శరత్ కుమార్ - తరుణ్ అరోరా - ప్రగ్యా జైశ్వాల్ - వాణీ విశ్వనాథ్ - సితార - నందు - శ్రవణ్ - జయప్రకాష్ - ధన్య బాలకృష్ణన్ - శివన్నారాయణ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రిషి పంజాబి
మాటలు: ఎం.రత్నం
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బోయపాటి శ్రీను
కథ:
గగన్ (సాయిశ్రీనివాస్) ఒక పెద్ద ఇండస్టియలిస్ట్ కొడుకు. అన్యాయాన్ని సహించడు. ఎదుట ఉన్నది ఎవరైనా సరే .. అతనికి తన తండ్రి/అన్నయ్య కూడా అందుకు సహకరిస్తుంటారు. ఇలాంటి సమయంలో గగన్ చదివే కాలేజీలో అతణ్ని చూసి ఇంప్రెస్ అయిన స్వీటీ (రకుల్ ప్రీత్)..గగన్ కు దగ్గరవుతుంది,అతనితో పాటు అతడి కుటుంబం కూడా ఆమెను ఇష్టపడుతుంది. స్వీటీ కూడా గగన్ ను ప్రేమిస్తుంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తన ప్రేమను గగన్ త్యాగం చేస్తాడు. కానీ తర్వాత స్వీటీ చాలా పెద్ద కష్టాల్లో ఉందని.. ఆమె జీవితానికి ప్రమాదమని తెలుస్తుంది గగన్ కు. ఆ ప్రమాదం ఏంటి.. స్వీటీ జీవితానికి వచ్చిన ముప్పు ఏంటి.. గగన్ ఆమెను ఎవరి నుంచి ఎలా కాపాడుకున్నాడు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఎప్పటిలాగే అన్యాయాన్ని సహించని హీరో.. క్రూరత్వానికి నిలువుటద్దం లాంటి విలన్స్ .. వాళ్ళు హీరోయిన్ కి హాని తలపెట్టడం ,హీరో ఎదురు నిలిచి పోరాడడం.. అదే బోయపాటి మార్కు రొటీన్ కధ.కాకపోతే ఈ సారి హీరోయిన్ ప్రాధాన్యత ఇచ్చి, ఆమె ప్రమాదం లో ఇరుక్కునే పరిస్థితులని అంతే బలంగా ఉండేలా చూసుకున్నాడు.
మొదట హీరో-హీరోయిన్ ల పరిచయం.. ఆ తరువాత హీరో ఫామిలీ తో సాగే సన్నివేశాలు పరవాలేదనిపిస్తాయి.హీరో ప్రేమనే వదులుకునే సన్నివేశం నుండి కధనం ఊపందుకుంటుంది. సీన్ వైజాగ్ కి షిఫ్ట్ అయ్యాక దారి తప్పినట్టు అనిపించినా, వెంటనే వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది.
సెకండాఫ్ లో అసలు కధ తెలిసాక, అనుకోకుండా ఇద్దరి విలన్స్ గొడవల మధ్య పడి హీరోయిన్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది బాగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు, ఆ సింపతీ ఫాక్టర్ ని ఉపయోగించుకునే హంసలదీవి నేపధ్యం లో వచ్చే పోరాట సన్నివేశంతో ఒక్కసారి ఎమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లడతాడు. ఎపుడు ఆ ఫైట్ వస్తుందా అనే రేంజ్ లో సెటప్ చేసి, ఆ అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా తీసాడు ఆ ఎపిసోడ్ ని. ఆ తరువాత విలన్స్ కాస్త ఆగి హీరో ని టార్గెట్ చేసే ఉదంతం అంతా తెలిసినదే అయినప్పటికీ అప్పటికే సిట్యుయేషన్ కి ట్యూన్ అయిపోయి ఉండడం వల్ల అది పెద్ద ప్రాబ్లెమ్ కాలేదు.. క్లైమాక్స్ ఫైట్ తో పాటు జగపతి బాబు తో హీరో డైలాగ్స్ బాగున్నాయి.
బోయపాటి శ్రీను తనకి అలవాటైన/నచ్చిన దారిలోనే మరో సారి వెళ్ళాడు. కాస్త తాను వీక్ గా ఉన్న అంశాల పై కూడా కాన్సన్ట్రేట్ చేసి సినిమాలు తీస్తే తనకి తిరుగు ఉండదు. హీరోయిజం చూపించాలనే తపనలో తను విలన్స్ ని చూపించే తీరు మరీ ఓవర్ ది టాప్ కి మించి ఉంటుంది. ఈసారి అదే ఫార్ములా ఫాలో అయినప్పటికీ ముందుగానే చెప్పుకున్నట్టు ఎమోషన్స్ వర్కౌట్ ఎలా చూసుకోవడం తో ఆ మైనస్ లు కవర్ అయిపోయాయి.
నటీనటులు:
బెల్లంకొండ శ్రీనివాస్ మొదట్లో బాగా బిగుసుకుపోయి ఉన్నా,క్యారెక్టర్ లో చలనం వచ్చిన తరువాత బాగానే చేసాడు, హీరోయిన్ తండ్రి తో సీన్.. క్లైమాక్స్ సీన్ లో తన నటన బాగుంది. రకుల్ పాత్రకి కథాపరంగా ప్రాధాన్యత ఉంది. ఫస్టాఫ్ లో బాగానే చేసినా, సెకండాఫ్ లో ఉన్న సీన్స్ లో ఎక్కువగా ఏడవడం వరకే పరిమితమైంది.ప్రగ్య జైస్వాల్ ది మరీ చిన్న పాత్ర. జగపతి బాబు..శరత్ కుమార్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. విలన్ గా తరుణ్ అరోరా కూడా బాగానే ఉన్నాడు. చాలా కాలం తరువాత తేర పై కనిపించిన వాణి విశ్వనాధ్ కి అసలు సరైన పాత్రే లేదు. అలాగే సుమన్ కూడా చాలా ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర లో కనిపించాడు. జయప్రకాష్.. సితార.. నందు.. తదితరులు పరవాలేదు.
సాంకేతిక వర్గం:
డైలాగ్స్ బాగానే ఉన్నాయ్. కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమా అంతా రిచ్ లుక్ తో ఉండడమే కాక, హంసల దీవి ఫైట్ కి ముందు షాట్లో కెమెరా పనితనం బాగుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం లో పాటలు పరవాలేదు, ఫస్టాఫ్ లో కన్నా సెకండాఫ్ లో వచ్చే పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
రేటింగ్: 6/10
0 comments:
Post a Comment