చిత్రం: ‘నేనే రాజు నేనే మంత్రి’
నటీనటులు: రానా దగ్గుబాటి - కాజల్ అగర్వాల్ - కేథరిన్ థ్రెసా - నవదీప్ - అశుతోష్ రాణా - తనికెళ్ల భరణి - సత్యప్రకాష్ - అజయ్ - ప్రదీప్ రావత్ - శివాజీ రాజా తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
మాటలు: లక్ష్మీభూపాల్
సమర్పణ: సురేష్ బాబు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి - భరత్ చౌదరి
కథ - కథనం - దర్శకత్వం: తేజ
కథ:
జోగేంద్ర (రానా దగ్గుబాటి) అనంతపురం జిల్లాలోని ఒక ఊరిలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ బతికే కుర్రాడు. అతడికి తన భార్య రాధ (కాజల్ అగర్వాల్) అంటే ప్రాణం. గర్భవతి అయిన రాధ ఆ ఊరి సర్పంచ్ భార్య కారణంగా తన బిడ్డను కోల్పోతుంది. దీంతో ఆ సర్పంచ్ పదవి దక్కించుకోవాలన్న కసి పెరుగుతుంది జోగేంద్రలో. ఇక అక్కడి నుంచి రాజకీయాల్లో మరిన్ని ఎత్తులకు ఎదిగే ప్రయత్నంలో పడతాడతను.మరి తన రాజకీయ ఎదుగుదల కోసం అతనేం చేశాడు.. ఈ క్రమంలో తనకు ఎదురైన అడ్డంకుల్ని ఎలా అధిగమించాడు.. చివరికి అతడి ప్రస్థానం ఎక్కడికి చేరింది.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
గత కొన్నేళ్లుగా సరైన విజయం లేక,. డైరెక్టర్ గా ఒకప్పటి తన స్థాయికి చాలా దూరంలో ఉన్న తేజ, ఫైనల్ గా తన టెంప్లేట్ లవ్ స్టోరీల్లోంచి బయటకి వచ్చి పొలిటికల్ డ్రామా తెరక్కేకించే ప్రయత్నం చేసాడు. ఆసక్తికరమైన టైటిల్,దానికి తగ్గ ప్రధాన పాత్రను తీర్చిదిద్దుకోవడం వరకు తేజ సఫలమయ్యాడు.
ఐతే జోగేంద్ర మినహా మిగతా పాత్రలని అంతే ఆసక్తికరంగా మలచడం లో మాత్రం విఫలమయ్యాడు. సర్పంచ్ ని ఓడించడం నుండి చివర్లో ముఖ్యమంత్రి అయేంత స్థాయికి సాగిన జోగేంద్ర ప్రస్థానం ఆధ్యంతం ఆకట్టుకోకపోయింది. ఇలాంటి సినిమాల్లో ఐతే రియలిస్టిక్ తరహా వాతావరణం ఉండేలా చూసుకోవాలి లేదా కమర్షియల్ రూట్ లో వెళ్లి హీరో ఎత్తుకు పై ఎత్తులు వేసి తాను అనుకున్నది సాధించడం అన్నది అయినా చూపించాలి.
భార్యకి జరిగిన అన్యాయానికి రగిలిపోయి సర్పంచ్ అయ్యే క్రమంలో ఎం చేసి జోగేంద్ర గెలిచాడు అనేది అర్ధం కాదు..ఆ తరువాత అతని రాజకీయ ఎదుగుదల ని కూడా అంతే కన్వీనియెంట్ గా చూపించేసాడు దర్శకుడు. ఏ దశలోనూ అతనికి సరైన ప్రత్యర్థి కానీ, సమస్యలు కానీ ఎదురు పడవు. ఫస్టాఫ్ వరకు రానా తన నటనతో సినిమాని నిలబెట్టాడు, అతని క్యారెక్టర్ కి పడ్డ డైలాగ్స్ చాలావరకు వర్కౌట్ అయ్యాయి. అలాగే ఇంటర్వెల్ ముందు నవదీప్ క్యారెక్టర్ పై నడిపించిన ఎపిసోడ్ ఆకట్టుకుని సెకండాఫ్ పై ఆశలు రేకెత్తించినా,సెకండాఫ్ లో మాత్రం సినిమా క్రమక్రమంగా పడిపోతూ వచ్చింది. ఒక దశ దాటాక కేవలం డైలాగ్స్ వల్లనే జోగేంద్ర పాత్రని ఎలివేట్ చేసారు తప్ప బ్యాక్ డ్రాప్ లో సరైన సన్నివేశాలు లేకుండా పోయాయి. అసలు భార్య కోసమే ఇదంతా అని మొదలు పెట్టిన జోగేంద్ర ,తరువాత ఎటు పోతున్నాడో అర్ధం కాదు. అతని ఎదుగుదల ఎంత సిల్లీ గా ఉంటుందో అతని పతనం కూడా అంతే ఇంపాక్ట్ లెస్ గా ఉండింది.ఏ దశలోనూ అతని పాత్రతో,అతని ప్రయాణం తో కనెక్ట్ అవలేం.
ఇక చివరి అరగంటను తేజ నడిపించిన విధానం మరీ దారుణంగా ఉంది. జోగేంద్ర తన కాండిడేట్స్ ని నిలబెట్టే ఎపిసోడ్ హాస్యాస్పదంగా ఉంది. దాని వల్ల చివరి సన్నివేశం లో జోగేంద్ర తీసుకున్న నిర్ణయం కూడా ఏ మాత్రం ఎఫెక్టివ్ గా లేకుండా పోయింది.
ముందుగానే చెప్పుకున్నట్టు తేజ కేవలం ప్రధాన పాత్ర మినహా మిగతా సినిమా మీద సరైన శ్రద్ధ వహించకుండా ఉండడం తో టైటిల్ లో ఉన్న పంచ్ సినిమా లో పూర్తిగా మిస్ అయింది.కుర్చీలాట సగం వరకు పరవాలేదనిపించినా ,తరువాత ఎత్తులు సరిగ్గా లేక చతికిలబడిపోయింది.
నటీనటులు:
జోగేంద్ర పాత్రలో రానా నటన అద్భుతం అనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు.ఐతే అంత మంచి నటనకి తగ్గ క్యారెక్టర్ గ్రాఫ్,దర్శకత్వ ప్రతిభ కూడా తోడై ఉంటే దానికి తగ్గ ప్రతిఫలం దక్కేది. కాజల్ పాత్రకి ప్రాధాన్యం ఉన్నట్టే అనిపించినా నటనకి పెద్దగా అవకాశం లేదు. కాథరిన్ తెరెసా పాత్ర చిత్రవిచిత్రంగా ఉండింది. అశుతోష్ రానా పేరు కి విలన్ కాబట్టి హీరో కి ఎదురెళ్ళినట్టు ఉంటుంది తప్ప ఎక్కడా తన ముద్ర వేయడానికి లేకుండా పోయింది. శివాజీ రాజా,నవదీప్ ఆకట్టుకున్నారు ..పోసాని..ప్రభాస్ శీను వీలయినంత నవ్వించారు.తనికెళ్ల భరణి.. అజయ్.. తదితరులు పరవాలేదు.
సాంకేతిక వర్గం:
డైలాగ్స్ చాలా వరకు బాగానే ఉన్నాయి.. కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం లో పాటలు పరవాలేదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒకే.
రేటింగ్: 4.5/10
0 comments:
Post a Comment