చిత్రం: ‘లై’
నటీనటులు: నితిన్ - మేఘా ఆకాశ్ - అర్జున్ - శ్రీరామ్ - రవికిషన్ - నాజర్ - మధునందన్ - పూర్ణిమ - సురేష్ - రాజీవ్ కనకాల - పృథ్వీ - బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: యువరాజ్
నిర్మాతలు: అనిల్ సుంకర - రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట - వెంకట్
రచన - దర్శకత్వం: హను రాఘవపూడి
కథ:
సత్యం (నితిన్) ఆవారాగా తిరిగే కుర్రాడు. అమెరికాకు వెళ్లి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం సెటిలైపోతుందని ఉద్దేశంతో ఆ ప్రయత్నంలో ఉంటాడు. ఆ సమయంలోనే ఛైత్ర (మేఘా ఆకాశ్)తో కలిసి అతను యుఎస్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరూ దగ్గరవుతారు. మరోవైపు అమెరికాలో ఉంటూ భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఒక అజ్నాత నేరస్థుడిని పట్టుకునేందుకు భారత నిఘా విభాగం ప్రయత్నిస్తుంటుంది. ఆ విభాగానికి చెందిన ఆది (శ్రీరామ్) కూడా యుఎస్ వస్తాడు. ఆ నేరస్థుడికి.. భారత నిఘా విభాగానికి మధ్య సాగే పోరులో సత్యం చిక్కుకుంటాడు. అప్పుడు సత్యం జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.. ఇంతకీ ఆ అజ్నాత నేరస్థుడు ఎవరు.. అతనేం చేస్తుంటాడు.. అతడికి-సత్యంకు సాగే పోరులో ఎవరు గెలిచారు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఇంగ్లీష్ స్పై థ్రిల్లర్ ల తరహా బ్యాక్ డ్రాప్ ఉన్న కధని దర్శకుడు హను రాఘవపూడి కాస్త తెలివిగా లవ్-ఇంటలిజెన్స్-ఎనిమిటీ అని మూడు అంశాలని కలుపుతూ కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు.
మొదటగా లవ్ ట్రాక్ విషయానికొస్తే చాలా సిల్లీగా ఉంటుంది. పాత్రల పరిచయం వరకు కాస్త బాగున్నా,ముందుకు సాగుతున్న కొద్దీ ఇటు ఎంటర్టైన్ చేయక ,అటు ఫీల్ కూడా లేకపోవడం తో ఏ మాత్రం ఆకట్టుకోదు.
ఇక ఇంటలిజెన్స్ ట్రాక్ లోకి వస్తే విలన్ క్యారెక్టర్ ని కాస్త ఇంటరెస్టింగ్ గానే పరిచయం చేసినా, ఆ తరువాత అతను పెద్దగా చేసిందేమి లేదు. కేవలం ముసుగులు వేసుకుని వేరే మనుషుల్లా మారిపోవడం మాత్రమే అతని ప్రత్యేకత అన్నట్టు చూపించారు. అతనికి కావాల్సిన సూట్ హీరో దగ్గర ఉంటుంది. సినిమా మొదలైన కాసేపటి నుండే ఆ సూట్ కోసం విలన్ డెస్పరేషన్ చూస్తే ఖచ్చితంగా దాని వెనుక ఏదో విషయం ఏదో దాగి ఉంటుంది అనేది అర్ధమైపోతుంది.ఇలాంటి కాన్సెప్ట్ లు చివర్లో సస్పెన్స్ లా రివీల్ ఐతే బాగుంటుంది కానీ సినిమా నిండా సూట్ చుట్టూనే తిరగడం తో అటు హీరో కి ఇటు విలన్ కి ఇంటలిజెన్స్ చూపించడానికి స్కోప్ లేకుండా పోయింది. ఎలాగో సూట్ తన వద్దే ఉంది కాబట్టి హీరో కి పెద్ద ఎత్తులు వేసే అవసరం లేదు. ముందుగానే చెప్పుకున్నట్టు మారు వేషాలు వేసి హీరో ని మోసం చేయడం తప్ప విలన్ వేరే ఏమి చేయడు కాబట్టి ఇద్దరి మధ్య అసలు యుద్ధం కోసం క్లైమాక్స్ వరకు ఆగాల్సి వచ్చింది. మధ్యలో ఒకటి రెండు సార్లు హీరో-విలన్ మధ్య మిస్ లీడ్ గేమ్ కాస్త బాగుంది అనిపించే లోపు సడెన్ గా కట్ చెప్పినట్టు లవ్ ట్రాక్ ఇరికించేయడం తో ఆ మాత్రం ఆసక్తి కూడా లేకుండా పోతుంది.
చివరగా ఎనిమిటీ.. నిజానికి ఈ ట్విస్ట్ చాలా రొటీన్ అయినప్పటికీ.. అప్పటి దాకా జరిగిన కధకి సరైన ముగింపు తో పాటు హీరో-విలన్ మధ్య పోరాటానికి కాస్త డెప్త్ యాడ్ చేయగలిగింది.
మొత్తానికి దర్శకుడు హను రాఘవపూడి కొత్తదనం అందించాలనే ప్రయత్నంలో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే తన ప్రతిభ చూపించగలిగాడు. ఇంటర్వెల్ వద్ద ఒక ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ వద్ద ఇంకో ట్విస్ట్.. ఇలా క్యాలికులేటడ్ ప్రాసెస్ లో వెళ్ళాడే తప్ప పూర్తిగా సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించడం లో విఫలమయ్యాడు.
నటీనటులు:
నితిన్ కొత్త లుక్ లో బాగున్నాడు..అతని నటన కూడా పాత్రకి తగ్గట్టు ఉంది.అర్జున్ పాత్ర కూడా బిల్డప్ తప్ప మేటర్ లేకున్నా తన నటన/స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంటాడు. మేఘ ఆకాష్ క్యూట్ గా బాగానే ఉంది.శ్రీరామ్, నాజర్, రవికిషన్ ఆయా పాత్రలకు సరిపోయారు. మధు నందన్..పృథ్వీ-బ్రహ్మాజీ ఓకే.
సాంకేతికవర్గం:
కెమెరా వర్క్ చాలా బాగుంది.. మణిశర్మ అందించిన పాటలు బాగానే ఉన్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయం లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ ఒకే.
రేటింగ్: 4.5/10
0 comments:
Post a Comment