చిత్రం : ‘శమంతకమణి’
నటీనటులు: నారా రోహిత్ - సుధీర్ బాబు - సందీప్ కిషన్ - ఆది - రాజేంద్ర ప్రసాద్ - చాందిని చౌదరి - అనన్య - జెన్నీ - తనికెళ్ల భరణి - హేమ - ఇంద్రజ - రఘు కారుమంచి - సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
కథ:
కోటీశ్వరుడి కొడుకైన కృష్ణ (సుధీర్ బాబు) తన తండ్రి మీద కోపంతో ఆయన రూ.5 కోట్లు పెట్టి వేలంలో కొన్న ‘శమంతకమణి’ అనే వింటేజ్ కారు తీసుకుని పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీ పూర్తి చేసుకుని బయటికి వచ్చేసరికి అక్కడ కారుండదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఈ కేసును ఎస్సై రంజిత్ కుమార్ (నారా రోహిత్) టేకప్ చేస్తాడు. పార్టీకి వచ్చిన శివ (సందీప్ కిషన్).. కార్తీక్ (ఆది).. ఉమామహేశ్వరరావు (రాజేంద్ర ప్రసాద్)లతో పాటు కృష్ణను కూడా అతను అనుమానిస్తాడు. అందరినీ విచారిస్తాడు. మరి వారి నుంచి రంజిత్ ఏం సమాచారం రాబట్టాడు.. ఇంతకీ ఆ కారు దొరికిందా లేదా అన్నది మిగతా కధ.
కథనం - విశ్లేషణ:
శమంతకమణి అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో పాటు మంచి కామెడీ థ్రిల్లర్ కి కావాల్సిన సెటప్ ఐతే ఉంది సినిమాలో. ముఖ్య పాత్రలన్నిటికీ భిన్న నేపధ్యం, వాళ్ళ వాళ్ళ పరిస్థితులకి తగ్గట్లు ఆశలు,లక్ష్యాలు.
ఫస్టాఫ్ ఇంటరెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది. ఐతే దొంగతనానికి ముందు ఎం జరిగిందో చూపించే ప్రయత్నం లో అన్ని పాత్రలని పరిచయం చేయడం ,అందరినీ ఒక చోటకి చేర్చే ప్రాసెస్ లో అంతగా చెప్పుకోదగ్గ విశేషాలేవీ లేకుండా పోయాయి. అక్కడక్కడా కామెడీ పరవాలేదు అనిపించినా, ఇంటర్వెల్ వరకు మరీ మామూలు గానే సాగుతుంది కధనం. సెకండాఫ్ లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. ఒక్కో పాత్ర నుంచి విడిగా ఫ్లాష్ బ్యాక్ ద్వారా కథను నడిపింది అసలు ఎం జరిగిందో అనే ఆసక్తిని మాత్రం అలాగే కొనసాగించగలిగాడు దర్శకుడు. పోలీస్ స్టేషన్ లో నారా రోహిత్ తో సందీప్ కిషన్ ,రాజేంద్ర ప్రసాద్, ఆది కి ఉండే సన్నివేశాలు అన్నీ నవ్విస్తాయి. సస్పెన్స్ వెనుక అసలు కారణం కొద్దిగా డిసప్పాయింట్ చేసినా, ఆ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది, క్లైమాక్స్ వద్ద అన్ని పాత్రల సమస్యలు ఆ శమంతకమణి కారు వల్లే తీరడం,అందరి కధలూ ఒక కొలిక్కి వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి ముఖ్యంగా నారా రోహిత్ క్యారెక్టర్ కి ఇచ్చే ఎండింగ్ సీన్ లో పడే పంచ్ హైలైట్ .
ముందుగానే చెప్పుకున్నట్టు ఆసక్తికరమైన కధ ఉన్నప్పటికీ, దాన్నీఆకట్టుకునేలా తెరకెక్కించడం లో శ్రీరామ్ ఆదిత్య కాస్త తడబడ్డాడు. సుధీర్ క్యారెక్టర్ కి సెట్ చేసిన "అమ్మ" సెంటిమెంట్ థ్రెడ్ మీద ఇంకా వర్క్ చేయాల్సింది. మొదటి సినిమా తో పోలిస్తే ఇందులో తన వర్క్ కన్నా హీరో/టెక్నీషియన్స్ హెల్ప్ తో అతను బయటపడ్డాడు.
నటీనటులు:
సీరియస్ గా సాగే పాత్రలో సుధీర్ బాబు పరవాలేదనిపిస్తాడు. పోలీస్ ఆఫీసర్ గా నారా రోహిత్ ఆకట్టుకుంటాడు. పల్లెటూరి కుర్రాడు పాత్రలో సందీవ్ కిషన్ తన ప్రెజన్స్ ఫీల్ అయ్యేలా చేసాడు. ఆది పరవాలేదు, బ్రేకౌట్ అయ్యే సీన్ లో బాగా చేసాడు. రఘు కారుమంచి కానిస్టేబుల్ పాత్రలో అలరించాడు. రాజేంద్రప్రసాద్ కి అంత స్కోప్ ఉన్నరోల్ కాకున్నా ఉన్నంతలో బాగానే నవ్వించాడు. హీరోయిన్స్ లో చాందిని చౌదరి మాత్రమే రిజిస్టర్ అయింది. సుమన్,తణికెళ్ళ భరణి, సత్యం రాజేష్, గిరి తదితరులు పరవాలేదు.
సాంకేతికవర్గం:
డైలాగ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి, సమీర్ రెడ్డి కెమెరా వర్క్ చాలా బాగుంది,మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.
రేటింగ్: 6/10
0 comments:
Post a Comment