కథ :
సత్యం (మోహన్ లాల్) ఆటో మొబైల్ వర్క్స్ రిపేరింగ్‌లో ఎంతో అనుభవమున్న వ్యక్తి. జనతా గ్యారెజ్ పేరుతో తన కుటుంబం, మిత్రులతో కలిసి ఓ గ్యారెజ్ నెలకొల్పి ఆటో మొబైల్ రిపేర్స్‌తో పాటు, తమ వద్దకు సాయం కోరి వచ్చేవారికి అండగా నిలబడుతూంటాడు సత్యం. చిన్నప్పట్నుంచీ ప్రకృతి పై ప్రేమ పెంచుకుంటూ ప్రకృతి నే తన ప్రపంచంగా మార్చేసుకొని బతుకుతూంటాడు ఆనంద్ (ఎన్టీఆర్).. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆనంద్, జనతా గ్యారేజ్ లోకి అడుగు పెట్టాల్సి వస్తుంది, ఆ తరువాత ఎం జరిగింది అన్నది మిగతా కధ.
కధనం-విశ్లేషణ :
ఫస్టాఫ్ లో జనతా గ్యారేజ్ ఒక శక్తిగా ఎదిగే వైనాన్ని బాగానే చూపించినా, ప్రకృతి ప్రేమికుడిగా ఆనంద్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలని మాత్రం అంత బలంగా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు . జనతా గ్యారేజ్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం తో ఆనంద్ పాత్రకి స్కోప్ లేకుండా పోయింది,ఉన్న ఆ కొద్దీ సమయం లో అతని అభిరుచి,ప్రేమ వ్యవహారాన్ని అన్నిటినీ ఇరికించినట్టు అనిపిస్తుంది.ఐతే ఆనంద్ గ్యారేజ్ లోకి అడుగుపెట్టే సన్నివేశంతో ఇక పై ఏదో జరగబోతుందనే ఆసక్తి కలిగేలా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ అంచనాలని అందుకుంటూ సెకండాఫ్ లో రాజీవ్ కనకాల ఎపిసోడ్ ఆకట్టుంటుంది. తరువాత వచ్చే ఫామిలీ డ్రామా సన్నివేశాలు కూడా బాగానే ఉన్నా, సబ్ ప్లాట్స్ ఎక్కువైపోవడం,చిన్నాపాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వలన చివరి అరగంట వీక్ అయిపోయింది. పైగా జనతా గ్యారేజ్ కి ఎదురు నిలబడే విలన్ పాత్ర సాధారణ స్థాయి లో కూడా తన ఉనికిని చాటుకోలేకపోవడం మరో మైనస్. మొత్తంగా కొరటాల శివ మరోసారి పాత కధని కొత్తగా చెప్పి ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, పాత్రల చిత్రణ, బలమైన కధనం ఉండేలా మరింత జాగ్రత్త వహించి ఉంటె రిపేర్ లు మిగలకుండా ఉండేవి.
నటీనటులు : ఆనంద్ పాత్రలో ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు, మోహన్ లాల్, సాయి కుమార్ కాంబినేషన్ లో ఉండే సన్నివేశాలు, అలాగే సెకండాఫ్ లో సమంత తో సన్నివేశం లో అతని నటన అద్భుతం. మోహన్ లాల్ పాత్ర సినిమా సగం లో కాస్త బ్యాక్ సీట్ తీసుకున్నా,ఆయన నటన,స్క్రీన్ ప్రెజన్స్ సినిమా ని నిలబెట్టాయి. సమంత,నిత్యా మీనన్ ల పాత్రలకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఉన్ని ముకుందన్,సచిన్ ఖేడేకర్ లు పరవాలేదు.
దేవయాని,అజయ్,సాయికుమార్,సురేష్,రెహమాన్, రాజీవ్ కనకాల ఇతర నటీనటులు అందరూ ఆయా పాత్రలకు సరిపోయారు.
ఇతర సాంకేతిక వర్గం : డైలాగ్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఒకే. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పరవాలేదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకే.
రేటింగ్ : 6/10
0 comments:
Post a Comment