కథ:
గణ (అల్లు అర్జున్) ఎప్పుడూ గొడవలతో సావాసం చేసే రకం. ఆర్మీ ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసి వచ్చేసిన గణ..తనను కొడుకులాగా చూసుకునే లాయర్ బాబాయి (శ్రీకాంత్)కి సంబంధించిన కేసుల్ని తనదైన శైలిలో డీల్ చేసి పరిష్కరిస్తుంటాడు.మరోవైపు సీఎం కొడుకైన వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) మాఫియా తరహాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటాడు.అరాచకాలకు పాల్పడుతుంటాడు. అన్యాయం అంటేనే సహించని గణ, ధనుష్ కి ఎదురేల్లాడా లేదా?? అన్నది మిగతా కద.
కథనం-విశ్లేషణ:
గతంలో చెప్పుకున్నట్టు తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి,ఆ కంఫర్ట్ జోన్ దాటి వాళ్ళు సినిమా తీయడం అనేది చాలా అరుదు.అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను కీ ఒక ఫార్మట్ ఉంది, తన లాభం/ఆదిపత్యం కోసం ఎంతకైనా తెగించే ఎంతమంది ప్రాణాలైనా తీసే విలన్, అన్యాయాన్ని ఎ మాత్రం సహించని హీరో ఆ విలన్ కి ఎదురెళ్ళడం,గెలవడం.
సరైనోడు కూడా అటు ఇటుగా ఇదే కధ.విలన్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ మొదలవుతుంది ఫస్టాఫ్. ఆ వెంటనే హీరో ఇంట్రో,ఐతే వీళ్ళిద్దరూ ఎదురుపడడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు.అసలైన ఛాలెంజ్ ని ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం దాచిపెట్టుకోవటంతో అంతవరకు హీరో- లేడీ ఎమ్మెల్యే లవ్ ట్రాక్,మధ్య మధ్యలో వీలు చిక్కినపుడల్లా హీరో ఎలివేషన్ తో ఫస్టాఫ్ ని నడిపించాడు. ఇక సెకండాఫ్ లో మొదలవుతుంది అసలైన కధ అన్నట్టు ఇంటర్వెల్ వద్ద తనదైన యాక్షన్ ఎపిసోడ్ తో ఫస్టాఫ్ ని ముగిస్తాడు.ఐతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు,డాడీ ఫైట్ ఎపిసోడ్ బాగుంది,ఆపై వచ్చే తెలుసా తెలుసా పాట కూడా ఆకట్టుకుంటుంది కానీ ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ ని ముగించే సన్నివేశంలో సరైన ఎమోషన్ ని రప్పించలేకపోయాడు.మాటిమాటికి బ్యాక్ గ్రౌండ్ అంటూ గోప్పలు చెప్పుకునే విలన్,తన మనుషులను కొట్టిందెవరో తెలుసుకోలేకపోవడం చిత్రంగా ఉంటుంది.కనీసం ఆ విషయం తెలిసే విలన్ హీరో ని ఇరుకున పెట్టడానికి ఏదైనా ప్లాన్ వేసినట్టు చూపించినా బాగుండేదేమో.ముందుగానే చెప్పుకునట్టు హీరో- విలన్ ఎదురుపడే సందర్భం చాలా ఆలస్యంగా వస్తుంది,వాళ్ళు ఎదురుపడ్డ అరగంటలో సినిమా అయిపోతుంది.ఎదురుతిరగడం కాదు అసలు తన దారిలో చిన్న అడ్డంకులు వచ్చినా ఎవర్నైనా చంపెసేటట్టు విలన్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దడంతో అసలు హీరో-విలన్ మధ్య గేమ్ కి చోటు లేకుండా పోయింది.క్లైమాక్స్ ఫైట్ కి ముందు,తరువాత సన్నివేశాలు రేసుగుర్రం తరహాలో ఉన్నాయి కానీ అవి అంతగా సింక్ అవలేదు.క్లైమాక్స్ ఫైట్ కి లీడ్ సీన్ బాగున్నా,ఫైట్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాల్సింది. మొత్తానికి సరైనోడు లో అన్ని కమర్షియల్ హంగులు ఉన్నా వాటన్నిటినీ సరైన విధంగా అమర్చే బలమైన కధ లేకపోవడంతో ఆర్డినరీ మార్కును దాటలేకపోయింది.
నటీనటులు:
అల్లు అర్జున్ నటన ఆకట్టుకుంటుంది,కామెడీ,యాక్షన్,ఎమోషన్ ఇలా అన్ని రకాల సన్నివేశాల్లోనూ సమర్ధవంతంగా రాణించి మెప్పించాడు.విలన్ గా ఆది కి సరైన క్యారెక్టర్ పడకపోయినా తనవరకు తాను బాగా చేసాడు.అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.రకుల్ నటన బాగానే ఉంది, కేథరిన్ ఒకే. శ్రీకాంత్ సినిమా అంతా కనిపించినా అంత స్కోప్ ఏమి లేదు.హీరో తండ్రి క్యారెక్టర్ కి తమిళ నటుడు జయప్రకాశ్ కాకుండా తెలిసున్న తెలుగు నటుడినే తీసుకుని ఉంటె ఇంకా బాగుండేది. సాయికుమార్ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు,విద్యురామన్ సాంబార్ కామెడీ ఎ మాత్రం బాగోలేదు, బ్రహ్మానందం ఒకటి రెండు పంచ్ లు బాగానే పేల్చాడు కానీ మిగతా సన్నివేశాలు బోర్. సుమన్,తదితరులు ఒకే.
ఇతర సాంకేతిక వర్గం:
రత్నం మాటలు బాగానే ఉన్నాయి,రిషి పంజాబీ కెమెరా వర్క్ చాలా బాగుంది,ఎడిటింగ్ ఒకే.తమన్ సంగీతం లో పాటలు పరవాలేదు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు తమన్.యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.
రేటింగ్:5/10
0 comments:
Post a Comment