కధ :
అచ్యుత రామారావు (నారా రోహిత్).. ఆనందవర్ధన్ రావు (నాగశౌర్య) అన్నదమ్ములు. వాళ్లింటి పై పోర్షన్ లోకి జ్యోత్స్న (రెజీనా) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది . ఇద్దరూ ఆ అమ్మాయిని ప్రేమిస్తారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరికి వారు తననే ఆ అమ్మాయి ప్రేమిస్తోందన్న భావనలో ఉంటారు. ఐతే ఇద్దరూ కలిసి ఒకేసారి ఆ అమ్మాయికి తమ ప్రేమ గురించి చెబుతారు. మరి జ్యోత్స్న వాళ్లకు ఏం సమాధానం చెప్పింది.. ఆ సమాధానంతో వాళ్ల జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి.. చివరికి ఏం జరిగింది అన్నది మిగతా కథ.
కదనం - విశ్లేషణ :
ఈ చిత్రం పోస్టర్/ట్రైలర్ లు చూస్తే ఒకమ్మాయి ,ఇద్దరబ్బాయిల మధ్య జరిగే సాధారణ ముక్కోణపు ప్రేమ కధ అనుకొంటాము. అలాంటి కధే అయినప్పటికీ ప్రధానంగా ఇది ఇద్దరన్నదమ్ముల మధ్య ఉన్న బంధం/సంఘర్షణల గురించిన కధ. దాన్ని అవసరాల మొదలుపెట్టిన విధానమే చాలా ఆసక్తికరంగా ఉంది.
ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో ముందుగా అన్నదమ్ములిద్దరూ ఒకరిని ఒకరు నిందించినట్టు వాళ్ళ భార్యలకు చెప్పడం, మళ్ళీ జరిగింది ఇదీ అన్నట్టు అసలు కధని చూపించిన విధానం ఆకట్టుకుంది. అచ్యుత్,ఆనంద్ పాత్రల మధ్య బంధాన్ని చూపించే సన్నివేశాలతో పాటు వాళ్లిద్దరూ జ్యో వెంట పడే సన్నివేశాలు,వాళ్ళ మధ్య స్నేహం బలపడడం లాంటి అంశాలతో నిండిన ఫస్టాఫ్ వేగంగానే నడిచిపోతుంది. ఇంటర్వెల్ నుండి ఎక్కువగా ఎమోషన్స్ మీద దృష్టి పెట్టడం తో కధనం కాస్త నెమ్మదిస్తుంది. సెకండాఫ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యో పాత్ర అలా ప్రవర్తించడం వెనుక తెలుసుకోలేనత రహస్యం ఏమీ ఉండదు, ఆ నేపధ్యాన్ని ఇంకా బలంగా రాసుకోవాల్సింది. ఇలాంటి లోపాలు ఉన్నా ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలతో ఆ ఫీల్ ని కొనసాగించగలిగాడు దర్శకుడు, ముఖ్యంగా కీలకమయిన క్లైమాక్స్ ని అతను చాలా బాగా తెరకెక్కించాడు. ఇటు రచయితగా తనదైన ముద్ర వేస్తూ, దర్శకుడిగా వినోదం తో పాటు ఏమోషన్స్ ని అవసరాల హ్యాండిల్ చేసిన తీరు ప్రశంసనీయం.
నటీనటులు :
నాగ శౌర్య,నారా రోహిత్ లు ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు, అన్నదమ్ములుగా చక్కగా కుదిరారు కూడా. రెజినా పాత్ర కు ప్రాధాన్యం ఉన్నా, నటనకు అంత గా స్కోప్ లేదు,ఉన్నంతలో బాగానే చేసింది. తనికెళ్ల భరణి.. సీత.. కృష్ణచైతన్య,పావని.. రాజేశ్వరి, ఇతర నటీనటులు పాత్రోచితంగా నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం :
డైలాగ్స్ చాలా సహజంగా ఉండి ఆకట్టుకున్నాయి, కెమెరా/ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది, కళ్యాణి మాలిక్/కోడూరి/రమణ అందించిన సంగీతం లో పాటలు సినిమా ఫ్లో లో ఇమిడిపోయాయి, నేపధ్య సంగీతం కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ఇదేమి లాహిరి,ఒక లాలన పాటలని సన్నివేశాలకు అనుగుణంగా ఉపయోగించుకున్న తీరు బాగుంది.
రేటింగ్ : 6.5 /10
0 comments:
Post a Comment