లోఫర్ రివ్యూ


                                          


కథ: 

మురళి (పోసాని కృష్ణమురళి) ఓ లోఫర్ తండ్రి. తన కొడుకు రాజాని చిన్నప్పుడే తన భార్య దగ్గర్నుంచి తీసుకొచ్చేసి..ఆ పిల్లాడిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం మొదలుపెడతాడు. కొడుక్కేమో తల్లి చనిపోయిందని చెబుతాడు.తల్లికేమో కొడుకు చనిపోయాడని చెబుతాడు.తండ్రితో పాటు జోద్ పూర్ లో సెటిలైపోయిన ఈ రాజా (వరుణ్ తేజ్) దొంగగా మారతాడు.తండ్రీ కొడుకులు దొంగతనాలు మోసాలు చేసుకుని బతికేస్తున్న టైంలో తండ్రి బలవంతంగా పెళ్లి చేస్తున్నాడని ఇంటి నుంచి పారిపోయి జోద్ పూర్ వస్తుంది మౌని (దిశా పటాని).ఆ అమ్మాయిని రాజా ప్రేమిస్తాడు.ఇంతలో మౌనిని ఆమె అన్నలు ఇంటికి లాక్కెళ్లిపోతారు.ఇక రాజా తన తల్లిని కలిసాడా ? మౌనిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది మిగతా కథ.


కథనం - విశ్లేషణ: 


పూరి తన మునుపటి ఫామ్ కోల్పోయి చాలా రోజులైంది ,మధ్యలో ఒక బిజినెస్ మాన్ ,టెంపర్ లాంటి సినిమాలని హీరో హెల్ప్ తో గట్టేక్కించినా రాను రాను తన మేకింగ్ స్టైల్ మరీ సాధారణంగా తయారవుతూ వస్తుంది."లోఫర్'లోనూ అదే జరిగింది.కధ బాగానే ఉన్నా తన మార్కు బద్ధకం/పైత్యం తో సినిమాని సరయిన దారిలో నడిపించలేకపోయాడు.మొదట్లో పోసాని హీరోకి చిన్నపటినుండే దొంగతనాలు,మోసాలు నేర్పించే సన్నివేశాలు బాగానే నవ్వించాయి.ఇద్దరూ డబ్బు కోసం ఏదైనా చేస్తారు అని చూపిస్తూనే హీరోకి ఉన్న అమ్మ సెంటిమెంట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసాడు.ఐతే ఆ తరువాత వచ్చే హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.హీరోయిన్ బ్యాక్ డ్రాప్ అంత సీరియస్ గా పెట్టుకుని కూడా సరైన సానుభూతిని తెప్పించలేకపోయాడు.అక్కడక్కడా కొన్ని పూరి మార్క్ పంచ్ లు పేలినా కాస్త అతి చాయలతో సాగుతున్న ఫస్టాఫ్ కి ఇంటర్వెల్ దగ్గరే ఊపు వస్తుంది.సెకండాఫ్ లో అమ్మ సెంటిమెంట్ ఉన్న అన్ని సీన్స్ బాగా వచ్చాయి, అలాగే  హీరో- విలన్స్ కి మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగానే ఎంటర్టైన్ చేసాయి ,అంతో ఇంతో పూరి మార్క్ హీరో కనిపించేది ఇక్కడే,ఐతే  విలన్స్  ని మొదట్లో ఏంతో క్రూరంగా చూపించి హీరో దగ్గరికొచ్చేసరికి వాళ్ళు రియాక్ట్ అవడం బాగా లేట్ చేసాడు. ఆ ట్రాక్ ని అలా సాదాసీదాగా హండిల్ చేయకుండా విలన్స్ ని హీరో దగ్గర కూడా అంతే దీటుగా చూపించి ఉంటే బాగుండేది.పైగా విలన్స్ ని ఎదురుకోవడానికి హీరో కి కూడా సరైన ప్లాన్ ఉన్నట్టు ఏదీ చూపించలేడు,ఏదో చేస్తాడు అనుకున్న ప్రతిసారీ మధ్యలోనే ఆ సీన్ ఎండ్  అయిపోతుంది.ప్రీ క్లైమాక్స్ లో విలన్స్ ని బకరా చేసే ఎపిసోడ్ మామూలుగా ఉంది .క్లైమాక్స్ లో వయోలెన్స్ మరీ ఎక్కువయింది. ఓవరాల్ గా పూరి  ఈ మద్య తీసిన సినిమాల్లో ఖచ్చితంగా కాస్త బెటర్ సినిమా."ఆడోళ్ళు  డైనోసర్లు ఒకటే "వంటి తన మార్కు డైలాగులతో ఇంకా తనలో మాటర్ ఉంది అని రుజువు చేసుకున్నా,మొత్తం సినిమాని మాత్రం తనదైన శైలిలో తెరకెక్కించలెకపొయాడు. 


నటీనటులు: 

రాజా  పాత్రలో వరుణ్ తేజ్ నటన బాగుంది, ఒక దొంగగా కనిపించే సన్నివేశాల్లో,హీరోయిన్ ని ఏడిపించే టిపికల్ లవ్ ట్రాక్ లో మంచి ఈజ్ ఉంది.అలాగే సెకండాఫ్ లో రేవతికి దగ్గరవడానికి ప్రయత్నించే సన్నివేశాల్లో కూడా బాగా చేసాడు.హీరోయిన్ గా దిశా పటాని బాగానే ఉంది.తల్లి పాత్రలో  రేవతి నటన చాలా బాగుంది.పోసాని తన మార్కు నటనతో బాగానే నవ్వించాడు కొన్ని సార్లు ఇరిటేట్ చేసాడు.అలీ కామెడీ పరవాలేదు,బ్రహ్మిది మరీ గెస్ట్ రోల్ తరహా పాత్ర.విలన్స్ గా చేసిన అందరూ ఒకే. 


ఇతర సాంకేతిక వర్గం:  

సునీల్ కశ్యప్ సంగీతం లో పాటలు పరవాలేదు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకే .కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఒకే.యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి. 


రేటింగ్: 5.25/10
Share on Google Plus

About aditya

Hai i am Aditya, a die hard telugu cinema fan and Critic,I watch almost all the telugu released on the first day and i will share my review in this blog

0 comments:

Post a Comment