కథ:
ఆత్రేయపురం అనే గ్రామంలో అల్లరి చిల్లరిగా తిరిగేస్తున్న ఆకాష్ నారాయణ్ (రవితేజ) తాను పెళ్లి చూపులు చూసిన అమ్మాయి తనను తిరస్కరించిందన్న కోపంతో బాగా ఫేమస్ అయిపోదామని ఓ మీటింగ్ లో మాట్లాడుతున్న మంత్రి మీద రాయేస్తాడు.ఆ మంత్రి అతడి గట్స్ చూసి తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు.మంత్రి దగ్గర పని చేస్తూ హోం మంత్రిని ఇంప్రెస్ చేసి అతడి దగ్గర ఓస్డీగా అపాయింట్ అవుతాడు.ఇంతకీ ఆకాష్ నిజంగానే ఫేమస్ అవడానికి ఇదంతా చేస్తున్నాడా లేక వేరే ఏదన్నా కారణం ఉందా?అన్నది మిగతా కధ.
కథనం - విశ్లేషణ:
మాస్ మసాలా ఫార్ములాని నమ్ముకునే "రచ్చ" సినిమాని అందించిన దర్శకుడు సంపత్ నంది మరోసారి అదే ఫార్ములా తో "బెంగాల్ టైగర్" ని తెరకెక్కించాడు.సాధారణ రివెంజ్ డ్రామాని హీరో క్యారెక్టర్ కి కాస్త డిఫరెంట్ టచ్ ఇచ్చి కామెడీ సహాయంతో బండి లాగేద్దామని చూసాడు.ఫస్టాఫ్ వరకు ఈ ఫార్ములా బాగానే వర్కవుట్ అయింది.హీరో ఫేమస్ అవ్వాలనే తాపత్రయం లో అతను చేసే క్రేజీ ఫీట్స్ తో నవ్విస్తూ మధ్యలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ప్లాన్ చేసుకున్నాడు.సపోర్ట్ గా ఫ్యూచర్ స్టార్ సిద్ధప్పగా పృథ్వి,సెలబ్రిటీ శాస్త్రిగా పోసాని కామెడీ,లవ్ ట్రాక్ లో రాశి ఖన్నా గ్లామర్ మరో ప్లస్.
ఇలా ఇంటర్వెల్ వరకు టైం పాస్ చేసి ఒకానొక ట్విస్ట్ తో ఫస్టాఫ్ ని ముగించాడు.ఆ ట్విస్ట్ తో సహా సెకండాఫ్ లో జరిగే వ్యవహారం పెద్దగా ఊహకందనిదేమీ కాదు.ఫస్టాఫ్ లో సినిమాకి హెల్ప్ అయిన పృథ్వి క్యారెక్టర్ ని సెకండాఫ్ లో సరిగా వాడుకోకుండా బ్రహ్మిని రంగంలోకి దించాడు,ఆ కామెడీ ఏమంత పండలేదు.పైగా ఫస్టాఫ్ లో అసలు కధ జోలికి వెళ్ళనంతవరకు బాగానే నేట్టుకోచ్చినా అసలు కధ దగ్గరికొచ్చేసరికి చతికిలపడ్డాడు దర్శకుడు.అవుట్ డేటెడ్ ఫ్లాష్ బ్యాక్ కి తోడు హీరో-విలన్ ఎదురుపడే సన్నివేశాల్లోనూ బలం లేదు,ఇద్దరికిద్దరూ తెలివైనవాళ్ళు అని ఇచ్చిన బిల్డప్ కి వాళ్ళిద్దరూ 24 గంటల చాలెంజ్ ఇంటరెస్టింగ్ గానే స్టార్ట్ అయినా తరువాత తేలిపోయింది.ఇక చివరి అరగంట లో హీరో విలన్ ఆట కట్టించే ప్లాన్,క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఇంపాక్ట్ పూర్తిగా మిస్ అవడం తో బెంగాల్ టైగర్ గర్జించలేకపోయింది.
నటీనటులు:
రవితేజ కి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు ,తన స్టైల్లో వీలైనంతగా ఎంటర్టైన్ చేసాడు.తమన్నా- రాశి ఖన్నా ఇద్దరూ గ్లామర్ డాల్స్ గా అందాల ప్రదర్శనలో ఎవరికీ వారు రెచ్చిపోయారు.పృథ్వి, పోసాని కామెడీ బాగానే పండింది,బ్రహ్మి పూర్తిగా వేస్ట్ అయ్యాడు.బోమన్ ఇరాని రేంజ్ కి తగ్గ క్యారెక్టర్ కానే కాదు.రావు రమేష్,షియాజీ షిండే,నాగినీడు తదితరులు పరవాలేదు.
సాంకేతిక వర్గం:
డైలాగ్స్ బాగానే ఉన్నాయి,కెమెరా వర్క్ చాలా బాగుంది.ఎడిటింగ్ ఒకే.భీమ్స్ సంగీతం లో పాటలు పరవాలేదు,చిన్న అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది.
రేటింగ్: 5/10
0 comments:
Post a Comment