కథ:
రామ్(సుధీర్ బాబు)తనను మోసం చేసిన అమ్మాయికి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో నాన్న మెకానిక్ షెడ్డులోని కారు తీసుకుని బయల్దేరి ఓ కారును గుద్దేస్తాడు.ఆ కార్లో కిడ్నాప్ అయిన అమ్మాయి సీత (వామికా) అక్కడి నుంచి తప్పించుకుంటుంది.దీంతో కిడ్నాపర్ శక్తి (సాయికుమార్) రామ్ తో పాటు అతడి ఫ్రెండును పట్టుకుంటాడు.తన ఫ్రెండును బందీగా పట్టుకుని సీతను తెచ్చివ్వమని రామ్ ను బ్లాక్ మెయిల్ చేస్తాడు?మరి రామ్.సీతను తిరిగి తీసుకొచ్చాడా?తన ఫ్రెండుని విడిపించుకున్నాడా?చివరికి అతడి కథ ఏ మలుపులు తిరిగింది?అన్నది మిగతా కధ.
కథనం-విశ్లేషణ:
క్రైమ్ కామెడీ జానర్ మూవీస్ తెలుగులో కాస్త తక్కువే వచ్చినా ప్రేక్షకుల్లో వాటికి మంచి క్రేజ్ ఏ ఉంది.కాస్త కొత్తదనం ఉండి ప్రేక్షకుడిని రెండు గంటల పాటు ధియేటర్ లో కూర్చోబెట్టే సత్తా ఉంటే ఆదరిస్తారని ఇదే జానర్ లో వచ్చిన"స్వామి రారా"రుజువు చేసింది.అలాంటి క్రైమ్ కామెడీ ని అందించడానికి కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య చేసిన ప్రయత్నమే"భలే మంచి రోజు'.
ప్రేమ కధలకు,హారర్ థ్రిల్లర్ కి ఉన్నట్టే క్రైమ్ కామెడీలన్నిటికి దాదాపు కూడా ఒకే ఫార్మాట్ ఉంటుంది."భలే మంచి రోజు'కూడా ఆ ఫార్మాట్ లోనే వెళ్ళినప్పటికీ దర్శకుడు తనదైన ముద్ర వేయడం లో సక్సెస్ అయ్యాడు.సినిమాలో ఉండే అన్ని పాత్రలని ఎంటర్టైనింగ్ గా ఉంటునే ఇంపార్టెన్స్ కూడా ఉండెలా చూసుకోవడం,చిన్న చిన్న ట్విస్టులతో వాటిని మెయిన్ స్టొరీ కి కనెక్ట్ చేయడం ఆకట్టుకుంటుంది. సుదీర్-వేణు ల మధ్య వచ్చే చేజ్ సన్నివేశం లో మొత్తం బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ గా ఉండి కేవలం యెల్లో కలర్ మాత్రమె హైలైట్ అవడం,ఇంటర్వెల్ ట్విస్ట్,హీరో తండ్రి హాస్పిటల్ ఎపిసోడ్ లాంటి చిన్న చిన్న సర్ ప్రైజ్ లు,క్లైమాక్స్ లో పృథ్వీ పాత్రని రంగలోకి దించే ఎపిసోడ్ ఇలా చాలా సన్నివేశాల్లో దర్శకుడి టాలెంట్ కనిపిస్తుంది.
ఫస్టాఫ్ కాస్త మొదట్లో స్లోగా ఉండి కధలో కి ఎంటర్ అవడానికి కాస్త టైం తీసుకున్నా హీరో గోల్ ఏంటో ఫిక్స్ అయిన తరువాత ఊపందుకుని ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు ఏమాత్రం తడబాటు లేకుండా సాగిపోయింది.సెకండాఫ్ లో మరి కొన్ని పాత్రలని ప్రవేశపెట్టి ట్విస్ట్ లతో బాగానే ప్లాన్ చేసుకున్నా అనవసరమైన రెండు పాటలు, కొన్ని డల్ మూమెంట్స్ వల్ల కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఐతే క్లైమాక్స్ వద్ద కొసమెరుపులా వచ్చే పృథ్వీ పాత్ర ఎపిసోడ్ అద్దిరిపోయింది.పోలీస్ పేరడీ డైలాగులతో మాక్సిమం ఎంటర్టైన్ చేసాడు పృథ్వి.సెకండాఫ్ మీద కొంచెం శ్రద్ధ వహించి ఉంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చి ఉండేది, అయినప్పటికీ ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్ లు మినహా "భలే మంచి రోజు" బాగానే ఎంటర్టైన్ చేసింది.
నటీనటులు:సుదీర్ బాబు పాత్రకి తగ్గ నటనతో మెప్పించాడు. వామిక గబ్బి ఆ పాత్రకి సరిపోయింది,పెర్ఫార్మన్స్ కి అంతగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది.సాయికుమార్- పృథ్వీ- వేణు-శ్రీరామ్-పోసాని-ప్రవీణ్-పరుచూరి గోపాల కృష్ణ..అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.తమ వంతుగా ఎంటర్టైన్ చేశారు.అందర్లోకి పృథ్వీనే హైలైట్ అయ్యాడు.
సాంకేతిక వర్గం:డైలాగ్స్ సింపుల్ గా బాగున్నాయి, కేమెరా వర్క్ల్ చాలా బాగుంది.ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది.సన్నీ ఎం ఆర్ అందించిన పాటలు పరవాలేదు కానీ సినిమాలో వాటికి తగ్గ సిచ్యుయేషన్ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది.
రేటింగ్:6/10
0 comments:
Post a Comment