కధ:
అఖిల్(అఖిల్)ఓ అనాథ కుర్రాడు.డబ్బుల కోసం ఫైట్లు చేస్తూ ఫ్రెండ్స్ తో జాలీగా గడిపేస్తూ సాగిపోతున్న అతను మెడికల్ స్టూడెంట్ అయిన దివ్య (సాయేషా)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెకి చేరువ కూడా అవుతాడు.ఇంతలో దివ్యను బోడో అనే ఆఫ్రికా రౌడీ ఎత్తుకెళ్తాడు. తన కోసం అఖిల్ ఆఫ్రికాకు బయల్దేరతాడు.ఇంతకీ దివ్యను బోడో ఎందుకు ఎత్తుకెళ్తాడు?తనకు తెలిసిన రహస్యమేంటి? ఆమెను కాపాడ్డానికి అఖిల్ ఏం చేశాడు? అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలు అందించడంలో వివి వినాయక్ స్టైలే వేరు,అక్కినేని అఖిల్ ని పరిచయం చేసే అవకాశం దక్కించుకున్న వినాయక్ దానికి సోషియో ఫాంటసీ తరహా నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. మొదట్లో మెయిన్ ప్లాట్ కి సంబందిచిన లింక్ ని ఎస్టాబ్లిష్ చేసిన తరువాత హీరో ఇంట్రో ఎపిసోడ్ తో సినిమా ఆసక్తికరంగానే ఆరంభమవుతుంది.ఆ తరువాత హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్ రొటీన్ గానే ఉన్నా పెద్దగా బోర్ కొట్టదు.అలాగే రాజేంద్ర ప్రసాద్-అఖిల్ మధ్య సన్నివేశాలు కూడా బాగానే ఎంటర్టైన్ చేస్తాయి.సీన్ యూరోప్ కి షిఫ్ట్ అయ్యాక కాస్త సాగదీసినట్టు అనిపించినా హీరోయిన్ కిడ్నాప్ నేపధ్యం లో ఇంటర్వెల్ చేజ్ ఎపిసోడ్ బాగా వర్కవుట్ అయింది.సెకండాఫ్ కి మంచి లీడ్ కుదిరినా ఆ ఆసక్తిని చివరివరకు ఉంచడం లో విఫలమయ్యాడు వినాయక్.విలన్ గ్యాంగ్ తో హీరో తలపడే సన్నివేశాలు అన్నీ యాక్షన్ ఎపిసోడ్స్ గానే రావడం,అసలు హీరో క్యారెక్టర్ కి మెయిన్ స్టొరీ అయిన జువా ఎపిసోడ్ తో సరైన లింక్ లేకపోవడం వల్ల ఎమోషన్ అసలు వర్కౌట్ అవలేదు.మధ్యలో బ్రహ్మానందం పంచ్ లు కాస్త నవ్విస్తాయి,ఐతే ముందుగానే చెప్పుకున్నట్టు మెయిన్ స్టొరీ కి సంబందించిన సన్నివేశాలు సినిమా తో సింక్ అవకపోగా,ఆ మైనస్ లని కవర్ చేయాల్సిన క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా హాస్యాస్పదంగా ఉండడం తో సినిమా గ్రాఫ్ అమాంతం పడిపోయింది.
నటీనటులు:
తోలి పరిచయం లో అఖిల్ పాస్ అయ్యాడు, ఇంట్రో ,టైటిల్ సాంగ్స్ లో డాన్స్ అదరగొట్టేశాడు,యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా మంచి ఈజ్ కనిపించింది.నటనాపరంగా అతనికంత స్కోప్ లేదు.హీరోయిన్ గా సాయెశాసైగల్ పరవాలేదు.రాజేంద్రప్రసాద్కి అంతగా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కలేదు.బ్రహ్మానందం,వెన్నెల కిశోర్ కామెడీ పరవాలేదు.మహేష్ మంజ్రేకర్,విలన్స్ గా చేసిన నటులు ఒకే.
సాంకేతిక వర్గం: డైలాగ్స్ కొన్ని చోట్ల పరవాలేదు కానీ ఓవరాల్ గా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కెమెరా వర్క్ బాగుంది, ఎడిటింగ్ పరవాలేదు.అనూప్ రుబెన్స్,తమన్(పడేసావే సాంగ్) అందించిన పాటలు బాగానే ఉన్నాయి.మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకటి రెండు సన్నివేశాల్లోనే బాగుంది.
రేటింగ్: 5/10
0 comments:
Post a Comment