కథ:
ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి నేపథ్యంలో సాగే కథ.ఒకే ఊరికి చెందిన వారు ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్) , ఈశ్వర్ (నికితిన్ ధీర్).ఈశ్వర్ - హరిబాబు కలిసి బ్రిటిష్ సైన్యం తరఫున ఇటలీలో జర్మన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడతారు.ఆ క్రమం లో వాళ్ళ పోరాటం ఎలా సాగింది?? మరోవైపు హరిబాబు ప్రేమకథ ఏ కంచికి చేరింది? అన్నది మిగతా కధ.
కథనం - విశ్లేషణ:తీసినవి మూడు సినిమాలే అయినా తన నుండి సినిమా వస్తుందంటే అందులో కొత్తదనం ఖచ్చితంగా ఉంటుంది అనే అంచనాలని ఏర్పరుచుకున్నాడు దర్శకుడు క్రిష్.ఈసారి కూడా తనదైన శైలిలో రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఒక ప్రేమకధని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
ఒక వైపు యుద్ధ సన్నివేశాలు,ఫ్లాష్ బ్యాక్ లో హీరో-హీరోయిన్ ప్రేమకధని చూపించడం అనే ఆలోచన బాగానే ఉంది.మొదటి నుండి చివరివరకు కధనం నెమ్మదిగానే నడుస్తుంది కాబట్టి ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించాలంటే అదే సరైన దారి.ఆరంభంలో వచ్చే యుద్ధ సన్నివేశాలని బాగా తెరకెక్కించాడు దర్శకుడు ,ఆ తరువాత వేరు వేరు సందర్భాల్లో జర్మన్ సైన్యం హీరో బృందం పై దాడి చేసే సన్నివేశాలు కూడా.ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రేమకధ కూడా బాగుంది.ఇంటర్వెల్ వద్ద హీరో ఒక పాపని కాపాడే సన్నివేశం తో మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చి ఫస్టాఫ్ ని ముగించాడు.ఐతే సెకండాఫ్ ని అదే స్థాయి లో ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు.హీరో బృందం విదేశీయుల మధ్య సన్నివేశాలు బాగానే ఉన్నాయి,ఐతే కులాల మధ్య గొడవలు ఎలా చెలరేగుతాయో అన్న విషయాన్ని ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశాడో,దాన్ని హీరో-హీరోయిన్ ప్రేమకధకి ముడిపెట్టిన తరువాత అంత బలంగా ముగింపునివ్వలేకపోయాడు.హీరో-హీరోయిన్ ని పెళ్లి చేసుకునే సన్నివేశం చాలా బాగా వచ్చింది,ఐతే ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ ముగించే సన్నివేశం తేలిపోయింది,అలాగే హరిబాబు-ఈశ్వర్ పాత్రల మధ్య సంఘర్షణని ఇంకాస్త బలంగా చెప్పాల్సింది,ఐతే హీరో క్యారెక్టర్ ని మలిచిన విధానం,సాధారణ యువకుడి నుండి చివరిలో గొప్ప సైనికుడిగా ఎదిగే వైనాన్ని చూపించిన తీరు బాగుంది.మొత్తానికి దర్శకుడు క్రిష్ ఉద్దేశ్యం మంచిదే అయినా,కధనం మీద మరింత ద్రుష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఇప్పటికైతే మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది.
నటీనటులు:ధూపాటి హరిబాబు గా వరుణ్ తేజ్ బాగా నటించాడు,అతని డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది,హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ కూడా బాగానే నటించింది, నికితిన్ దీర్ నటన బాగానే ఉన్నా,ఆ పాత్రకి అతను సరిపోలేదు,కాస్త తెలిసున్న తెలుగు నటుడు ఎవరైనా చేసుంటే బాగుండేది.గొల్లపూడి ఎంతో సహజంగా నటించి మెప్పిస్తే,షావుకారు జానకి ఉన్నంతలో కొన్ని సన్నివేశాలతోనే తన ఉనికిని చాటుకుంది.హీరో వెంట ఉండే సైనికుడి పాత్రలో అవసరాల శ్రీనివాస్ ఆకట్టుకున్నాడు.
సాంకేతిక వర్గం :సాయి మాధవ్ రాసిన మాటలు చాలా బాగున్నాయి,కేమెరా వర్క్ బాగుంది, ఎడిటింగ్ కూడా ఒకే. చిరంతన్ భట్ సంగీతం లో పాటలు పరవాలేదు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
రేటింగ్ - 6/10
0 comments:
Post a Comment