కథ:
సుబ్రమణ్యం (సాయిధరమ్ తేజ్) కాసుల కోసం ఏ పనికైనా రెడీ అనే రకం. తను ప్రేమించిన వాడి కోసం ఇంట్లో చూసిన సంబంధం వద్దనుకుని అమెరికా వచ్చేసిన సీత (రెజీనా) అతడికి పరిచయమవుతుంది. ఐతే తప్పనిసరి పరిస్థితుల్లో సుబ్రమణ్యం సీతకు భర్తగా నటించాల్సి వస్తుంది. మరి ఈ నాటకం ఎన్నాళ్లు కొనసాగింది.. సుబ్రమణ్యం - సీత తమ సమస్యల్ని పరిష్కరించుకుని ఎలా దగ్గరయ్యారు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
చాలా మామూలు కధ, దాన్ని పరమ రొటీన్ కధనం తో చెప్పే ప్రయత్నం చేశాడు హరీష్ శంకర్. లవ్,కామెడీ,యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, అన్నిటినీ సమపాళ్ళలో కధనం లో ఇమిడిపోయేలా చేయడం లో ఫెయిల్ అయ్యాడు. ఫస్టాఫ్ లో హీరో ,హీరోయిన్ ఎంట్రీ దగ్గర్నుంచి వాళ్ళు ఇద్దరు పరిస్థితుల వల్ల కలిసి ఉండడం అన్నీ ఊహించదగ్గవే, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహా కామెడీ కూడా అంతగా పండలేదు. ఇలా పడుతూ లేస్తూ వెళ్తున్న సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతో ఇంతో ఊపునిస్తుంది. సెకండాఫ్ లో ఎంటర్టైన్ చేయడానికి సేఫ్ బెట్ అయిన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. ఐతె అందులో కూడా అంతగా సక్సెస్ అవలేదు, ఫిష్ వెంకట్ గ్యాంగ్ /రావు రమేష్ ,సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కాస్త పరవాలేదు అంతే. కేవలం కామెడీ మీదనే బండి లాగిద్దామనుకున్నాడు కానీ ముందుగానే చెప్పుకున్నట్టు అవి అక్కడక్కడా మాత్రమె వర్కవుట్ అయ్యాయి. పైగా హీరో,హీరోయిన్ ల తో పాటు ముఖ్యమైన పాత్రల చిత్రణ సరైన విధంగా లేకపోవడం తో కీలకమైన ఎమోషనల్ సీన్స్ తేలిపోవడంతో పాటు నవ్వు తెప్పిస్తాయి. ఇంకా క్లైమాక్స్ వద్ద వచ్చే మెలోడ్రామా సన్నివేశాలు దారుణంగా ఉన్నాయి. సినిమా మొత్తం మీద దర్శకుడు సక్సెస్ అయింది ఒక్క రావు రమేష్ క్యారెక్టర్ దగ్గరే, బాగా ఎంటర్టైన్ చేయగలిగాడు ఆ పాత్ర ఉన్న అన్ని సన్నివేశాలు. ఆ జాగ్రత్త మిగతా పాత్రల మీద, కధనం మీద కూడా తీసుకుని ఉంటే బాగుండేది.
నటీనటులు:
సాయిధరమ్ తేజ్ నటన లో మంచి ఈజ్ ఐతే ఉంది ,కాస్త డైలాగ్ డెలివరీ మీద దృష్టి పెడితే బాగుంటుంది, ఎక్కువ సన్నివేశాల్లో డైలాగ్స్ అవసరానికి మించిన వేగం తో చెప్పాడు.రెజినా నటన పరంగా పరవాలేదు, పాటల్లో చాలా అందంగా కనిపించింది. అదా శర్మ ది రొటీన్ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్, బ్రహ్మి కామెడీ జస్ట్ ఒకే. నాగబాబు - సుమన్ - అజయ్ - నరేష్ పాత్రలకు తగ్గట్లు నటించారు. కామెడీ విలన్ తరహా పాత్రలొ రావు రమేష్ అదరగొట్టాడు.
సాంకేతిక వర్గం:
డైలాగ్స్ పరవాలేదు , సి రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది, ఎడిటింగ్ ఒకే. మిక్కి జె మేయర్ అందించిన సంగీతం లో పాటలు బాగానే ఉన్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరవాలేదు.
రేటింగ్:4/10
0 comments:
Post a Comment