కథ:
డిగ్రీ మధ్యలో వదిలేసిన కళ్యాణ్ (నితిన్) ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. చాలా ప్రయత్నాలు చేసిన అతడికి ఉద్యోగం దొరకదు. ఐతే ఓ బట్టల దుకాణంలో సూపర్ వైజర్ గా పని చేసే కావ్య (యామి గౌతమ్) కోసమని ఫ్రెండు పని చేస్తున్న కంపెనీలో కొరియర్ బాయ్ గా చేరతాడు కళ్యాణ్. ఆమె వెంట తిరుగుతూ ఆమెను మెప్పించే పనిలో ఉండగా.. అనుకోకుండా అతడి చేతికో కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ లో ఓ పెద్ద కుంభకోణానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. దీంతో దాన్ని చేజిక్కించుకోవడానికి ఆ కుంభకోణం వెనుకున్న వ్యక్తులు కళ్యాణ్ వెంట పడతారు. ఇంతకీ ఆ కొరియర్లో ఉన్న సమాచారమేంటి? ఆ కుంభకోణమేంటి? ఆ కొరియర్ ను చేరాల్సిన చోటికి చేర్చి కళ్యాణ్ ఈ ముఠా ఆట కట్టించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
చిన్నదే అయినా దర్శకుడు ప్రేమ్ సాయి రాసుకున్న కధ ఆసక్తికరమైనదే . ఐతే ఆ మూల కధకి అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ తోడవ్వడం తో కధనం మెప్పించలేకపోయింది. అసలు కధేంటో మొదటి పది నిమిషాల్లోనే చెప్పేసిన దర్శకుడు, ఆ కధలోకి హీరో ఎంటర్ అయ్యే సంధర్భం మాత్రం చాలా లేట్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్ చాలా మామూలు గా ఉంది , ఒకటి రెండు సీన్స్ తప్ప కామెడీ కూడా అంతే. మధ్యలో అసలు కధకి సంబందించిన సన్నివేశాలు బాగానే ఉన్నా సైడ్ ట్రాక్ కి ఎక్కువ టైం వేస్ట్ చేయడంతో సినిమా ముందుకి కదలదు. ఇంటర్వెల్ టైం కి ఏదో జరగబోతుంది అన్నట్టు ఇంట్రెస్ట్ ఐతే క్రియేట్ చేయగలిగాడు కానీ అదే ఊపుని సెకండాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయాడు. హీరో చేతికి వీలైనంత తొందర లో కొరియర్ అందించడం మానేసి మళ్లీ ఒక పాట ,కామెడీ సీన్ పెట్టి బోర్ కొట్టించాడు. ఎట్టకేలకు హీరో చేతికి కొరియర్ అందాక కధనాన్ని కాస్త వేగంగా నడిపి ఆకట్టుకుంటాడు కానీ అంతలోనే సడెన్ గా ఊడిపడ్డట్టు మెయిన్ విలన్ సీన్ లో కి రావడం , హీరో అతని ఆటని అంతం చేయడం చకచకా జరిగిపోతాయి. నిజానికి హీరో చేతికి కొరియర్ దక్కడమే ఇంటర్వెల్ గా పెట్టుకుని ఉంటే సెకండాఫ్ లో హీరో - విలన్ మధ్య మంచి గేమ్ కి ఛాన్స్ దొరికి ఉండేది. అసలు సంగతి ఏంటో హీరో తెలుసుకున్న కొద్దిసేపటికే సినిమా అయిపోవడం తో అసలు ఎమోషన్ వర్కవుట్ అవలేదు.
నటీనటులు:
టైటిల్ రోల్ లో నితిన్ నటన బాగానే ఉంది, హీరోయిన్ గా యామి గౌతమ్ కి పెద్దగా ప్రాధాన్యత లేదు. హర్షవర్ధన్ సురేఖావాణి రాజేష్ బాగా చేశారు. అశుతోష్ రాణా నాజర్ రవిప్రకాష్ పాత్రలకు తగ్గట్లు నటించారు.
సాంకేతికవర్గం:
డైలాగ్స్ పరవాలేదు, పాటలు వినడానికి బాగున్నాయి కానీ సినిమాకి అవి అవసరమే లేదు, కధనానికి స్పీడ్ బ్రేకర్స్ గాఅడ్డుపడ్డాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకే.
కేమెరా వర్క్ ,ఎడిటింగ్ ఒకే .
రేటింగ్:5/10
Bhayya bagundi kaani oka chinna suggestion. Story section ekkuva elaborate cheyyaku... And spell check okasari chesuko, before publishing!! :)
ReplyDelete