కథ:
కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడే వారసుడి కోసం రాజ్య ప్రజలందరూ ఎదురు చూస్తున్న సమయంలో గణపతి దేవుడికి (కృష్ణం రాజు) అమ్మాయి జన్మిస్తుంది. ఐతే అమ్మాయి పుడితే రాజ్య ప్రజలు నీరుగారిపోతారని.. దేవగిరి సామ్రాజ్యానికి చెందిన శత్రు సైన్యం దండెత్తి వస్తుందని భయపడి.. మంత్రి శివదేవయ్య (ప్రకాష్ రాజ్) సలహా మేరకు తనకు పుట్టింది అమ్మాయి కాదని అబ్బాయి అని అబద్ధమాడి అందరినీ నమ్మిస్తాడు గణపతి దేవుడు. తన కూతురైన రుద్రమదేవి (అనుష్క)కు రుద్రదేవుడు అని నామకరణం చేసి అబ్బాయిలాగే పెంచుతాడు. యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. మరి రుద్రదేవుడిగానే చెలామణి అయిన రుద్రమదేవి పెరిగి పెద్దయ్యాక రాజ్యాధికారం ఎలా చేపట్టింది... తన రహస్యం బయటపడ్డాక ఏం చేసింది.. తన రాజ్యంపైకి దండెత్తి వచ్చిన మహాదేవుడు (విక్రమ్ జీత్)ను ఎలా ఎదుర్కొంది.. చాళుక్య వీరభద్రుడు (రానా) గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్)ల సాయంతో ఆమె యుద్ధంలో ఎలా గెలిచింది.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఎన్నో వాయిదాల తరువాత ,ఎంతో కష్టపడి రిసెర్చ్ చేసి తీశానని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చిన "రుద్రమదేవి" సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కధాపరంగా సినిమాలో ఎలాంటి లోటు లేదు,ఐతే ఆ కధని అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో మటుకు గుణశేఖర్ విఫలమయ్యాడు.ప్రారంభంలో రుద్రమదేవి జన్మరహస్యం దాచిపెట్టి రుద్రమదేవుడు గా ప్రజలకి పరిచయం చేసే ఘట్టం,ఆపై ఆమె బాల్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే గోనగన్నారెడ్డి పరిచయ సన్నివేశం కూడా.ఆ తరువాతే కధనం దారి తప్పింది, రుద్రమదేవి రహస్యం బయటపడే సందర్భం మరీ ఆలస్యం చేయడం బాగోలేదు, ఇంటర్వెల్ వద్దే ఆ ట్విస్ట్ వస్తుందేమోనన్న ఆసక్తిరేపినా అలాంటిదేమి లేకుండానే ముగుస్తుంది ఫస్టాఫ్. ఆ ట్విస్ట్ రివీల్ చేయడం మరీ లేట్ చేయడం తో అప్పటివరకు సాగతీతకి గురయింది కధనం, ఎట్టకేలకు ఆ ట్విస్ట్ వచ్చిన తరువాత కూడా కీలకమైన రుద్రమదేవి పట్టాభిషేకం,దాన్ని సామంతరాజులతో పాటు ప్రజలు కూడా తిరస్కరించే ఎపిసోడ్ సరిగ్గా వర్కవుట్ అవలేదు. ఆ తరువాత యుద్ధసన్నివేశాలు మొదట్లో అబ్బో అనిపించినా ఆద్యంతం అలరించాలేకపోయాయి. పైగా గోనగన్నారెడ్డి వచ్చి రుద్రమదేవికి సాయపడ్డట్టు చూపించడంతో మరింత తేలిపోయింది ఆ సన్నివేశం. మొత్తానికి గుణశేఖర్ ప్రయత్నం మంచిదే అయినప్పటికీ, కధనం లో లోపాల వల్ల "రుద్రమదేవి" సాధారణ స్థాయిని దాటలేకపోయింది.
నటీనటులు:
పేరుకి టైటిల్ రోల్ పోషించినా పాత్ర చాలా సేపటి వరకు బ్యాక్ డ్రాప్ లోనే ఉండిపోవడంతో అనుష్కకి అంతగా నటించే స్కోప్ లేదు,ఉన్నంతలో పరవాలేదనిపించింది,గోనగన్నారెడ్డి గా అల్లు అర్జున్ బాగున్నాడు,సంభాషణలు పలికిన తీరు బాగుంది.అతను కనిపించిన ప్రతి సన్నివేశం సినిమాకి ప్లస్ అనే చెప్పాలి.రానా పాత్ర కి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు. ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో పాత్రని పోషించి మెప్పించాడు.పాత్ర చిన్నదైనా నిత్య మీనన్ తన నటనతో అక్కట్టుకుంటుంది,చిన్నప్పటి రుద్రమగా నటించిన ఉల్కా గుప్తా బాగా నటించింది.కృష్ణంరాజు,సుమన్,ఆదిత్య మీనన్ లు పరవాలేదు.
అజయ్,జయప్రకాశష్ రెడ్డి తదితరులు ఒకే.
సాంకేతిక వర్గం:
ఇళయరాజా అందించిన సంగీతం లో పాటలు ఆకట్టుకోకేకపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏమాత్రం బాగోలేదు,కొత్తగా అనుకుని ట్రై చేసినట్టు ఉన్నారు కానీ సన్నివేశాలకు ఏమాత్రం సింక్ లో లేదు. కేమెరా వర్క్ బాగుంది ,కాస్ట్యూమ్స్,ఆర్ట్ వర్క్ విభాగాలు సినిమాకి అతి పెద్ద ప్లస్.గ్రాఫిక్స్ పరవాలేదు. డైలాగ్స్ బాగున్నాయి.
రేటింగ్: 5/10
0 comments:
Post a Comment