రివ్యూ: జెర్సీ
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: నాని, శ్రద్ధా శ్రీనాధ్, సత్యరాజ్, మాస్టర్ రోనిత్ కమ్రా, ప్రవీణ్, సంపత్ రాజ్, రావు రమేష్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సానూ వర్గీస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
"మళ్లీ రావా" ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి,నాని తో కలసి క్రికెట్ నేపధ్యం లో తెరకెక్కించిన ''జెర్సీ" పై మొదట్నుంచి మంచి అంచనాలే ఏర్పడ్డాయి.స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాస్ మన ఇండస్ట్రీ లో అరుదు గా వస్తుంటాయి,అపుడపుడు అలా పై పైన ఫలానా స్పోర్ట్ ని బ్యాక్ డ్రాప్ గా పెట్టుకునే సినిమాలు తప్ప..
రీసెంట్ గా "మజిలీ" చిత్రం కూడా క్రికెట్ నేపధ్యం లో తెరకెక్కినా అందులో క్రికెట్ కన్నా ప్రేమకథ కే ఎక్కువ ప్రాధాన్యత ఉండింది.
ఫస్టాఫ్ క్రికెట్ ని అక్కడక్కడా టచ్ చేస్తూ అర్జున్ జీవితం లో ముడిపడ్డ వాళ్ళతో అనుబంధాన్ని చూపిస్తూ ముందుకు సాగుతుంది.ఆట తో పాటు ఉన్న ఉద్యోగం పోగుట్టుకున్న అర్జున్.. ఎలాంటి పరిస్తితులలో ఉన్నాడు .. ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకున్నాడు అన్న విషయం మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేసాడు దర్శకుడు. ఇంటర్వెల్ ముందు అసలు గ్రౌండ్ లో కి హీరో తో పాటు సినిమా కూడా అడుగు పెడుతుంది.
సెకండాఫ్ లో ఊహించినట్టుగానే క్రికెట్ ఎపిసోడ్స్ ఎక్కువ, ప్రెడిక్టబుల్ అవడం వలన ఒక దశ దాటాక ఆ వ్యవహారం కాస్త బోర్ కొట్టినా, సినిమా ని మరో స్థాయి కి తీసుకెళ్లే క్లైమాక్స్ తో ముగించి ఆకట్టుకుంటాడు దర్శకుడు.
అర్జున్ పాత్ర ఖచ్చితంగా నాని కెరీర్ బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు.. పాత్రలో ఇమిడిపోయిన నాని అద్భుతమైన నటన తో సినిమా ఆద్యంతం తానే అయి ముందుకు నడిపించాడు. శ్రద్ధా శ్రీనాథ్ నటన కూడా చాలా బాగుంది. సత్యరాజ్ కోచ్ పాత్ర లో బాగున్నాడు. నాని గా నటించిన రోనిత్ గుర్తుండిపోతాడు. సంపత్ రాజ్,ప్రవీణ్ తదితరులు ఒకే.అనిరుద్ సంగీతం లో పాటలు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా సినిమా లో కలిసిపోయాయి. సినిమా కి అతని పనితీరు కూడా మరో బలం అనడం లో ఎలాంటి సందేహం లేదు.
స్లో నెరేషన్ .. సెకండాఫ్ లో క్రికెట్ ఎపిసోడ్స్ ని ఇంకా బాగా తీసే అవకాశం ఉండటం తప్ప అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించడం లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చాలా వరకు సఫలమయ్యాడు.తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. బర్త్ డే గిఫ్ట్ గా జెర్సీ అడిగితే ఆ చిన్న కోరిక ని తీర్చలేని నిస్సహాయ స్థితి లో కొడుకు మీద చేయి చేసుకునే ఎపిసోడ్ కావచ్చు.. తన తండ్రి ఫోటో పేపర్ లో పడింది అన్న వార్త విన్నపుడు ఆ పిల్లాడు ఇచ్చేరియాక్షన్ కావచ్చు.. అలాగే సచిన్ బొమ్మ తీసి తండ్రి ఫోటో పెట్టుకునే సన్నివేశం కావచ్చు.. తన ఇంట్లో తానే దొంగతనం చేసే వచ్చినపుడు భార్య కు బదులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న సన్నివేశం కావచ్చు. చివర్లో ఆట లో భాగం కాకపోతే తనను తానె కోల్పోతాను అనే భయం తో భార్య వద్ద ప్రాధేయపడే సన్నివేశం ఇలా చాలా సందర్భాల్లో భావోద్వేగాల ని పండించిన తీరు కు దర్శకుడు కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
రేటింగ్: 70/100
0 comments:
Post a Comment