నటీనటులు: విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా - శ్రుతి రామచంద్రన్ - ఆనంద్ - సుహాస్ - చారు హాసన్ - సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఛాయాగ్రహణం: సుజీత్ సారంగ్
మాటలు: జయకృష్ణ
నిర్మాాతలు: నవీన్ ఎర్నేని - యలమంచిలి రవిశంకర్ - మోహన్ చెరుకూరి - యాష్ రంగినేని
రచన - దర్శకత్వం: భరత్ కమ్మ
గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత విజయ్- రష్మిక జంటగా చేసిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించే క్రేజ్ ఉన్న హీరో- హీరోయిన్, అలాగే మంచి నిర్మాణ సంస్థ, సాంకేతిక నిపుణుల టీం అందుబాటులో ఉన్న కొత్త దర్శకుడు భరత్ కమ్మ చక్కని ప్రేమ కథ కు సందేశం తో పాటు అంతర్లీనంగా మరిన్ని అంశాలను చూపించే ప్రయత్నం చేసాడు.
ఐతే కథ అనుకోవడం వరకు ఒకే, అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించడం లో చాలా వరకు తడబడ్డాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్ లో సన్నివేశాలు మరీ నెమ్మదిగా సాగినా ఆకట్టుకునేలా ఉంటాయి. ఐతే ఈ ప్రేమ కథ కు కాన్ఫ్లిక్ట్ పాయింట్ కావాల్సిన స్టూడెంట్ పాలిటిక్స్ ట్రాక్ ని మాత్రం సినిమా లో ఇరికించినట్టు ఉంటుంది.
మళ్ళీ సినిమా లో ఆ పార్ట్ ని టచ్ చేయని దర్శకుడు ఒక పాట లో కొనసాగింపు ని ఇచ్చి ముగిస్తాడు, ఆ మాత్రం దానికి ఆ ట్రాక్ పై అంత సమయం వృధా చేయడం ఎందుకో అర్ధం కాదు. ఇక ప్రేమికులకు ఇద్దరూ విడిపోయిన తరువాత హీరో ప్రయాణం చేసి మారతాడు, ఎం చూసి ఏ పరిస్థితుల వాళ్ళ మారాడు అనేది సరిగ్గా చూపించలేదు. ప్రేయసి తో మిగిలి ఉన్న జ్ఞాపకాలే అతడి మార్పు కు కారణం అనేది ఎక్కడో చివర లో అసందర్భంగా ఒక పాటలో చూపించారు.
ఇక కనీసం ఆ తరువాత ఇద్దరు ప్రేమికులు మళ్ళీ దగ్గరయ్యే సన్నివేశాలు బాగున్నాయా అంటే అది లేదు, హాస్పిటల్ నుండి హీరోయిన్ ని తీసుకువెళ్ళిన తరువాత వచ్చే ఎపిసోడ్ మరింత బలంగా ఉండాల్సింది,అసలు కథ ను దర్శకుడు చివరి అరగంట కు ముందు కానీ టచ్ చేయలేదు, ఆ ఎపిసోడ్ కూడా ఈ సినిమా కి అతకని వ్యవహారం లా ఉంటుంది తప్ప ఒక ఎమోషనల్ షాక్ లాగా ఉపయోగపడదు. లైంగిక వేధింపులు అనే సమస్య ని ప్రస్తావించడం అనేది అభినందించదగ్గ విషయమే కానీ ఆ ఉదంతాన్ని కేవలం క్లైమాక్స్ కి లీడ్ లాగా ఉపయోగించడం వల్ల ఆ ప్రయత్నానికి దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోయింది.
అంత బాధ ని, లో లోపల సంఘర్షణ ని ఎదుర్కునే హీరోయిన్ క్యారెక్టర్ పై మరింత ఫోకస్ చేసి ఆమె పోరాటాన్ని చూపించి ఉంటె ఏంతో బాగుండేది. దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టకుండా సినిమా ని అనవసరంగా సాగదీసాడు.
కెమెరా వర్క్, సంగీతం దర్శకుడు కి వీలయినంత సహాయం అందించాయి. విజయ్ దేవరకొండ, రస్మిక మందన్న ఇద్దరు వారి పాత్రలకు న్యాయం చేసారు.జంటగా ఇద్దరు చాలా బాగున్నారు, మిగిలిన వారి లో సుహాస్ కాస్త గుర్తుంటాడు, అలాగే క్రికెట్ సెలెక్టర్ గా చేసిన నటుడు కూడా, ఆనంద్, చారు హాసన్ .. ఇతర నటీనటులు పరవాలేదు.
రేటింగ్: 50/100
0 comments:
Post a Comment