రివ్యూ: చిత్రలహరి
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
తారాగణం: సాయితేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్, సునీల్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: ఏ. శ్రీకర్ ప్రసాద్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్ (సి.వి.ఎం.)
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
ఆరు వరుస పరాజయాల తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరు మార్చుకుని, దర్శకుడు కిషోర్ తిరుమల సహాయం తో కాస్త కొత్త కధ/పాత్రలో కనిపించి మెప్పించే ప్రయత్నం చేసాడు. చిత్రంగా దర్శకుడు చెప్పదలచుకున్న కధ కూడా జీవితంలో వరుసగా ఓడిపోతూ గెలుపు కోసం తపించే యువకుడి కథే.
హీరో తో పాటు ఇద్దరు హీరోయిన్ ల పాత్ర లు, అలాగే హీరో తండ్రి, ఇతర సహాయ పాత్రలకు కూడా అంతో ఇంతో ప్రత్యేకత ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. ఆరంభం లో అలా ప్రతి పాత్రా పరిచయం అయ్యే కొద్ది ఆసక్తిని కలిగిస్తూ ముందుకు సాగుతుంది కధనం. హీరో ప్రేమ వ్యవహారం తో పాటు పోసాని,సునీల్ ఇతర పాత్రల తో సన్నివేశాలు కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. ఊహించినట్టు గానే ఇంటర్వెల్ ముందు సమస్యలు రావడం, హీరో ప్రేమ తో పాటు కెరీర్ కూడా ప్రమాదం లో పడడం తో ముగుస్తుంది ఫస్టాఫ్.
ఇక సెకండాఫ్ కాస్త సీరియస్ టోన్ లో సాగినా, గ్లాస్ మేట్స్ సాంగ్ కు ముందు సీన్.. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ బాగానే ఉరటనిచ్చాయి.ముంబై ఎపిసోడ్ పరవాలేదు.. ఆ పై వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ మరింత బలంగా ఉండాల్సింది.
సాయి తేజ్ పాత్రకు తగ్గ నటన తో ఆకట్టుకుంటాడు. కళ్యాణి ప్రియదర్శన్,నివేథా పేతురాజ్ కూడా బాగానే చేసారు.తండ్రి పాత్ర లో పోసాని ఒదిగిపోయాడు. సునీల్ కి చాలా రోజులకి పాత్ర లభించింది. తన నటన కూడా బాగుంది. వెన్నెల కిశోర్ ఉన్నంత లో బాగానే నవ్వించాడు. బ్రహ్మాజీ, జయప్రకాష్,ప్రదీప్ తదితరులు పరవాలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లో ప్రేమ వెన్నెల పాట మాత్రమే బాగుంది. నేపధ్య సంగీతం పరవాలేదు.
కిషోర్ తిరుమల ఎంచుకున్న కధ ఖచ్చితంగా యువతరం రిలేట్ చేసుకోతగ్గదే.అందుకు తగిన పాత్రలను ఒక దగ్గరకు చేర్చి చిత్రలహరి గా తీర్చిదిద్దడం లోనే తడబడ్డాడు. ఆక్సిడెంట్ జరిగినపుడు సహాయం అడిగే పరిస్థితి లో లేక ప్రాణాలు కోల్పోయే వాళ్ళను రక్షించడం కోసం ఒక ఆప్ ను కనిపెట్టి, దాన్ని అందరికి చేరువ అయ్యేలా చూడటమే హీరో లక్ష్యం. ఉద్దేశం గొప్పదే. కానీ ఆ కాన్సెప్ట్ ప్రేక్షకుడి ని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేది కాదు, లేదా అంత బలంగా దాన్ని తేర పైకి తీసుకురావడం లో దర్శకుడు విఫలమయ్యాడు అని చెప్పవచ్చు. సినిమా అంతా సక్సెస్ రుచి చూడాలి అని తపించి పోయే హీరో పాత్ర కి కనెక్ట్ అయ్యేలా అతని జర్నీ లో ఒడిదుడుకులు మనకు కనిపించవు. డైలాగ్స్ ద్వారా అతను బాధ పడటం తెలుస్తుంది తప్ప అతని స్ట్రగుల్ కానీ పెయిన్ కానీ ఫీల్ అయ్యేంత ఎఫెక్టివ్ గా కధనం ను నడిపించలేక పోయాడు దర్శకుడు. అలాగే అతని ప్రేమ కధ జోలికి వస్తే.. బ్రేకప్ వరకు ఒక ఫ్లో లో కాస్త అర్ధవంతంగా ఉన్న ఆ లవ్ ట్రాక్ సెకండాఫ్ లో కన్వీనియంట్ గా నడుస్తుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ ..ఎప్పటిలాగే తన మార్కు సింపుల్ అండ్ ఎఫెక్టివ్ డైలాగ్స్ సహాయం తో సినిమా చూసినంత సేపు బాగానే ఉంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేయగలిగాడు కానీ సినిమా బయటకు వచ్చాక గుర్తుండిపోయేంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయాడు.
రేటింగ్: 58/100
0 comments:
Post a Comment