కథ:
విక్రమ్ అలియాస్ విక్కీ (నాగచైతన్య) అనే కుర్రాడి జీవితంలోకి వేర్వేరు దశల్లో ముగ్గురు అమ్మాయిలు ప్రవేశిస్తారు. ముందు టీనేజీలో ఉండగా సుమ (అనుపమ పరమేశ్వరన్)తో.. ఆ తర్వాత కళాశాల స్థాయిలో ఉండగా సితార (శ్రుతి హాసన్)లో.. ఆపై జీవితంలో స్థిరపడ్డాక సింధు (మడోన్నా సెబాస్టియన్)తో ప్రేమలో పడతాడు విక్కీ. మరి ఆ ముగ్గురమ్మాయిలు అతడి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించారు.. చివరికి విక్కీ జీవితం ఎవరితో ముడిపడింది అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
పైన చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి జీవితంలో మూడు ప్రేమకథల సమాహారమే ఈ సినిమా. మొదటి ప్రేమ కధ ఇంతకుముందు వచ్చిన చాలా టీనేజ్ ప్రేమకథల మాదిరిగానే ఉన్నా ఆకట్టుకుంటుంది. ఆ వయసులో ఉండే తెలియని తనం,అల్లరిని సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఆ తరువాత కాలేజీ నేపథ్యంలో వచ్చే రెండో ప్రేమకథ సినిమాకే ప్రధాన ఆకర్షణ,స్టూడెంట్-లెక్చరర్ మధ్య ప్రేమ అన్న అంశమే చాలా ఆసక్తికరం. దాన్ని వీలైనంత ఎఫెక్టివ్ గానే ప్రెజంట్ చేసాడు దర్శకుడు.
ఈ ప్రేమకథలో సహజమైన వాతావరణం ప్రతిబింబిస్తూనే, హ్యూమర్/కమర్షియల్ పే ఆఫ్ సీన్స్ ని కూడా ఇమిడిపోయేలా చూసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్.. ఫీల్ రెండూ ఉన్న ఈ ప్రేమకథ ముగింపులో ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఇక చివరగా వచ్చే మూడో ప్రేమ కధ కాంటెంపరరీ ఫీల్ తో సాగుతుంది. పైకి చాలా మామూలుగా అనిపించినా,ముఖ్యమైన సన్నివేశాలను అంతే బలంగా తీర్చిదిద్దడం వల్ల ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా చందు మొండేటి తన ప్రత్యేకతతను చాలా సన్నివేశాల ద్వారా చాటుకున్నాడు. వెంకీ,నాగ్ ల క్యామియో సీన్స్ ని హ్యాండిల్ చేసిన తీరు,సేమ్ డ్రెస్ కోడ్,హ్యాండ్ కర్చీఫ్ త్రేడ్స్ కి ఇచ్చిన లింక్, అన్నిటికంటే ముఖ్యంగా "శ్రీఖండ్" సీన్ ని క్లైమాక్స్ లో సింక్ చేసిన తీరు అద్భుతంగా ఉంది.
నటీనటులు:
నాగ చైతన్య తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర చేసాడు, మూడు ప్రేమకథలకు తగ్గట్టు వేరియేషన్స్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ లో శృతి ఇంటి బయట సన్నివేశం,క్లైమాక్స్ కి ముందు మడోన్నా తో చిన్న కాన్ఫ్రంటేషన్ తరహా సన్నివేశంలో పర్ఫెక్ట్ గా చేసాడు. అనుపమ పరమేశ్వరన్ కనిపించేది కొద్దిసేపే అయినా గుర్తుండిపోతుంది. మడోన్నా సెబాస్టియన్ బాగుంది, తన నవ్వు,హావభావాలతో ఆకట్టుకుంది .సితార పాత్రలో శృతి హాసన్ తనదైన ముద్ర వేసింది. హీరో ఫ్రెండ్ పాత్ర లో ప్రవీణ్ అదరగొట్టేశాడు..శ్రీనివాసరెడ్డి కూడా వీలైనంత నవ్వించాడు.. చైతన్య కృష్ణ,నర్రా శీను.. బ్రహ్మాజీ. తదితరులు పరవాలేదు.
సాంకేతిక వర్గం:
మాటలు బాగున్నాయి, రాజేష్ మురుగేశన్,గోపీసుందర్ అందించిన పాటలు బాగున్నాయి,కధనం లో ఇమిడిపోయాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కెమెరా వర్క్,ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరాయి.
రేటింగ్: 6.5/10
0 comments:
Post a Comment