కధ:
కృష్ణ(నాని),మహాలక్ష్మి (మెహ్రీన్ కౌర్) చిన్ననాటి ప్రేమికులు,మహాలక్ష్మి అన్నయ్యకి తమ ప్రేమ విషయం తెలిస్తే చంపేస్తారనే భయం వల్ల పదిహేనేళ్ళుగా తమ ప్రేమ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.ఐతే తప్పనిసరి పరిస్తుతుల్లో తన ప్రేమ విషయం చెప్పడానికి బయల్దేరుతాడు కృష్ణ,ఆ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులేంటి,వాటినుండి బయటపడి తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనేది మిగతా కధ .
కథనం - విశ్లేషణ:
తోలి చిత్రం "అందాల రాక్షసి " సక్సెస్ అవకపోవడంతో దర్శకుడు హను రాఘవపూడి ఈసారి స్టైల్ మార్చి "కృష్ణగాడి వీర ప్రేమ గాధ"అనే ఎంటర్టైనర్ తో మన ముందుకొచ్చాడు,అతనికి "భలే భలే మగాడివోయ్"లాంటి బ్లాక్ బస్టర్ విజయంతో జోరు మీదున్న నాచురల్ స్టార్ నాని తోడయ్యాడు.
ఫస్టాఫ్ లో సీరియస్ బ్యాక్ డ్రాప్ అయిన ఫ్యాక్షన్ సన్నివేశాలు అప్పుడప్పుడూ చూపిస్తూనే హీరో పిరికితనం కి సంబందించిన సన్నివేశాలతో బాగానే ఎంటర్టైన్ చేసాడు దర్శకుడు. అలాగే లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది. కాస్త నెమ్మదిగా నడుస్తున్నా అలరించిన కధనం ఇంటర్వెల్ ముందు వరుస ట్విస్టులతో ఒక్కసారిగా ఊపందుకుంటుంది.'నా జీవితంలో కష్టమైన హాఫ్ అయిపోయింది,ఇష్టమైన హాఫ్ ఇప్పుడు మొదలవుతుంది'అని ఇంటర్వెల్ వద్ద హీరో డైలాగ్ తోటే అతనికి నిజమైన కష్టం ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పకనే చెప్తాడు దర్శకుడు.ఇక సెకండాఫ్ లో మెయిన్ ట్రాక్ తో పాటు కొన్ని సైడ్ ట్రాక్స్ ఎంటర్ అయి కాస్త గందరగోళం నింపినా,ఫస్టాఫ్ తో పోలిస్తే కధనం కాస్త గాడి తప్పినా మురళీశర్మ-పృధ్వీ-ప్రభాస్ శ్రీను ట్రాక్,చిన్న పాప,ఆమె చేతిలోని బొమ్మ చుట్టూ అల్లుకున్న సీన్స్ తో బాగానే నవ్వించాడు దర్శకుడు.ఇక క్లైమాక్స్ ముందు చిన్నపిల్లల సెంటిమెంట్ తో కాస్త డ్రామా ఎక్కువైనా,క్లైమాక్స్ ఫైట్ ని నాని తన నటనతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. మొత్తానికి కమర్షియల్ రూట్ నే ఎంచుకున్నా,వీలైనంత కొత్తగా,ఆకట్టుకునేలా తెరకెక్కించడం లో దర్శకుడు హను రాఘవపూడి చాలావరకు సక్సెస్ అయ్యాడు.
నటీనటులు:
నాని ఎప్పటిలాగే పాత్రలో లీనమైపోయాడు,కృష్ణగాడిగా అలరించాడు.ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటన ఆకట్టుకుంటుంది.హీరోయిన్ గా మేహ్రీన్ జస్ట్ ఒకే.ముఖ్యమైన సన్నివేశాల్లో కూడా ఆమె నటన సాధారణ స్థాయిలోనే ఉంది.హీరోయిన్ అన్నయ్యగా నటించిన నటుడు ఆకట్టుకుంటాడు,దర్శకుడు అతని క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది.సంపత్ రాజ్ ఆ పాత్రకి సరిపోయాడు.హీరో ఫ్రెండ్ గా సత్యం రాజేష్ పరవాలేదు.బ్రహ్మాజీ-పృథ్వి కామెడీ బాగుంది.మురళి శర్మ,హరీష్ ఉత్తమన్ తదితరులు ఒకే.
సాంకేతిక వర్గం:
మాటలు సహజంగా ఉండి ఆకట్టుకున్నాయి,యువరాజ్ కేమెరా వర్క్ చాలా బాగుంది,ఎడిటింగ్ ఒకే. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో పాటలు బాగానే ఉన్నాయి,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.
రేటింగ్: 6/10
0 comments:
Post a Comment