కథ:
హర్ష (మహేష్ బాబు) పాతిక వేల కోట్ల ఆస్తికి వారసుడు. అతడి తండ్రి రవికాంత్ (జగపతి)కు కొడుకు తన వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించాలని కోరిక. కానీ హర్షకు వ్యాపారం మీద ఆసక్తి ఉండదు. కష్టంలో ఉన్న మనిషిని ఆదుకోవాలనే తాపత్రయం అతడిది. ఇలాంటి పరిస్థితుల్లో హర్షకు చారుశీల (శ్రుతి హాసన్)తో పరిచయమవుతుంది. ఆ తరువాత కొన్ని పరిస్థితుల వల్ల హర్ష ఉత్తరాంధ్రలోని దేవరకోట అనే గ్రామానికి వెళ్తాడు. ఇంతకీ ఆ గ్రామంతో రవికాంత్ కు సంబంధమేంటి? ఆ ఊరికెళ్లి హర్ష ఏం చేశాడు? అతడికి అక్కడ ఎదురైన ఆటంకాలేంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి అతనేం సాధించాడు? అన్నది మిగతా కధ .
కథనం విశ్లేషణ:
తోలి చిత్రం మిర్చి తో పాత కధనే ఆకట్టుకునేలా చెప్పిన కొరటాల శివ ఈసారి కమర్షియల్ సూత్రాలు అన్ని సమపాళ్ళలో ఉన్న కధకి మంచి సందేశాన్ని జతచేసి మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం లో చాలావరకు సఫలమయ్యాడు. సినిమా మొదటి నుండి చివరివరకు ఊహించదగ్గ కధనమే అయినా హీరో క్యారెక్టర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేసి ఆ కోణం లో సినిమాని నడిపించిన తీరు, కీలకమైన ఎమోషనల్ మూమెంట్స్ ని హండిల్ చేసిన తీరు చాలా బాగుంది.
హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్ కి అసలు కధ తో లింక్ పెట్టడం బాగుంది, అసలు హీరో తన లక్ష్యాన్ని తెలుసుకునేది కూడా హీరోయిన్ క్యారెక్టర్ ద్వారానే. ఇక ముగ్గురు విలన్స్ తో హీరో ఒక్కోసారి తలపడే సన్నివేశాలు చాలా బాగున్నాయి. హీరో క్యారెక్టర్ కి ఇచ్చిన డిఫరెంట్ ట్రీట్మెంట్ వల్ల ఆ సన్నివేశాల్లో హీరోయిజం కూడా కొత్తగా,ఒక సన్నివేశం లో హీరో చెప్పిన "అదో రకం" డైలాగ్ తరహా లో ఉండి ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో హీరోని రంగం లోకి దించిన దర్శకుడు ఆ తరువాత హీరో ఊరిని దత్తత తీసుకునే సన్నివేశాలని చాలా సింపుల్ గానే హండిల్ చేస్తూ తనదైన శైలిలో ఎమోషన్స్ ని పండిచాడు. హీరో ప్రజలకి దగ్గరయ్యే క్రమం లో వచ్చే జాగో పాట చిత్రీకరణ ఆ ఫీల్ ని మరో స్థాయి కి తీసుకెళ్ళింది. ఓ పక్క హీరో ఊరికి చేసే మంచి తో పాటు, ముందుగానే చెప్పుకున్నట్టు విలన్స్ ని ఎదుర్కునే సన్నివేశాల్లో హీరోయిజం పండించి ఆకట్టుకున్నా డు దర్శకుడు.
అయితే ప్రీ క్లైమాక్స్ లో కీలకమైన మహేష్-జగపతి బాబు కాన్ఫ్రంటేషన్ సీన్ తరువాత సినిమాని సరైన ట్రాక్ లో నడిపించడం లో కాస్త తడబడ్డాడు అనే చెప్పాలి. కధలో జగపతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉన్నపుడు అతను మారిన తరువాత యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి కానీ , అది హీరోకి సంభందించిన సమస్య మాత్రమే అన్నట్టు చూపించి, ఆ పై ఒక రొటీన్ ఫైట్ తో సినిమాని ముగించడం తో క్లైమాక్స్ తేలిపోయినట్టు అనిపించింది.
నటీనటులు:
హర్ష పాత్రలో మహేష్ నటన తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ లలో ఒకటి అని చెప్పుకోవచ్చు. తనదైన శైలిలో పాత్రలో ఒదిగిపోయిన మహేష్ ప్రతి సన్నివేశం లో చెలరేగిపోయాడు. ఇక తన గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆ ఎలిమెంట్ ని దర్శకుడు కూడా సన్నివేశానుకనుగుణంగా వాడుకున్నాడు. శృ తి హాసన్ అందంగా ఉండడమే కాక ఉన్నంతలో మంచి నటనతో ఆకట్టుకుంటుంది. జగపతి బాబు తండ్రి పాత్రకి సరిపోయాడు. రాజేంద్రప్రసాద్ కూడా సహజంగా నటించి మెప్పించాడు. ముకేష్ రిషి, సంపత్ రాజ్, హరీష్ లు విలన్ రొల్స్ లో ఒకే. అలీ,వెన్నెల కిశోర్ కామెడీ పరవాలేదు. రాహుల్ రవీంద్రన్, సుబ్బరాజు తదితరులు ఉన్నారు అంతే.
సాంకేతిక వర్గం : కొరటాల శివ డైలాగ్స్ సింపుల్ గా బాగున్నాయి,మధీ కెమెరా వర్క్ చాలా బాగుంది, సినిమా అంతా కలర్ఫుల్ గా, రిచ్ గా ఉంది. ఎడిటింగ్ పరవాలేదు,దేవిశ్రీప్రసాద్ సంగీతం లో పాటలు బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఫైట్స్ కూడా బాగున్నాయి.
రేటింగ్: 7/10
0 comments:
Post a Comment