నటీనటులు: టైగర్ గా టైటిల్ రోల్ పోషించిన సందీప్ కిషన్ కి ఒక స్టార్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ దక్కింది , సినిమాలో కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత షో మొత్తం తనదే. కామెడీ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు,ఎమోషనల్ మూమెంట్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. రాహుల్ రవీంద్రన్ ఒకే, హీరోయిన్ గా సీరత్ కపూర్ పరవాలేదు. ఉన్నది కొద్దిసేపే అయినా సత్య కామెడీ బాగుంది. రాహుల్ కి సహాయం చేసే పాత్రలో సింగర్ సాందీప్ తన ప్రెజన్స్ ఫీల్ అయ్యేలా చేసాడు. విలన్స్ గా చేసిన నటులు అంతగా ఎఫెక్ట్ చూపించలేకపోయారు, కాస్త తెలిసున్న నటులైతే బాగుండేది ఆ పాత్రలకి.
కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: టైగర్ [సందీప్ కిషన్], విష్ణు [రాహుల్ రవీంద్రన్] ఇద్దరు అనాధాశ్రమంలో స్నేహితులు, విష్ణు దత్తతకి వెళ్ళిపోయిన తరువాత కూడా వాళ్ళ స్నేహం అలాగే కొనసాగుతుంది. అయితే గంగ [సీరత్ కపూర్] ని ప్రేమించిన విష్ణు ఆ ప్రేమ వల్ల ప్రమాదంలో పడతాడు. ఆ ప్రమాదం నుండి విష్ణుని టైగర్ ఎలా కాపాడుకున్నాడు అనేదే మిగత కధ.
సినిమా మొదట్లోనే అనాధాశ్రమం ఎపిసోడ్ తో ఇద్దరు హీరోల మధ్య ఉన్న స్నేహాన్ని, అలాగే టైగర్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . ఆ తరువాత ప్రమాదం లో పడ్డ విష్ణుని చూపించి అతని ద్వారా కధ ని నేరేట్ చేయడం రొటీన్ కి కాస్త భిన్నంగా ఉంది. విష్ణు - గంగ ల లవ్ ట్రాక్ వీలైనంత తొందరగానే ముగించాడు. ఆ తరువాత టైగర్ ఎంట్రీతో కధనం ఊపందుకుంటుంది, ఆ ఊపుని అలా కొనసాగిస్తూనే విష్ణు హాస్పిటల్ లో చేరే సన్నివేశం నుంచి ఇంటర్వెల్ వరకు ఇంకా ఆసక్తికరంగా సాగుతుంది ఫస్టాఫ్. సెకండాఫ్ కధనం ఊహించిన దారిలోనే సాగుతుంది,హాస్పిటల్ లో టైగర్ విలన్ గ్యాంగ్ తో ఆటాడుకునే సీన్ బాగానే పండినా ఆ తరువాత పెద్దగా గుర్తుండిపోయే సన్నివేశాలు లేవు, ఇంటర్వెల్ ముందు హీరోకి ఇచ్చిన బిల్డప్ కి తగ్గట్టే సెకండాఫ్ ప్లాన్ చేసుకున్నా వీక్ విలన్స్ వల్ల హీరో ఎలివేషన్ అంతగా వర్కవుట్ కాలేదు. వారణాసి/హానర్ కిల్ల్లింగ్ బ్యాక్ డ్రాప్ కేవలం బ్యాక్ డ్రాప్ వరకే పరిమితమైంది తప్ప ఎమోషన్ పండలేదు. క్లైమాక్స్ లో కూడా మెలోడ్రామా ఎక్కువైపోయింది. ఫస్టాఫ్ లో ఉన్న బిగి సెకండాఫ్ లో కూడా ఉండి ఉంటే బాగుండేది .
డైలాగ్స్ పరవాలేదు,చోట కే నాయుడు కెమెరా వర్క్ చాలా బాగుంది. తమన్ సంగీతం లో "హాల్లా బోల్" పాట బాగుంది, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఒకే.
రేటింగ్: 5.5/10
చివరిగా: ఆకట్టుకునే ఫస్ట్ హాఫ్, సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ , తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ "టైగర్" కి ప్లస్ అయితే అంచనాలని అందుకోలేని వీక్ సెకండాఫ్ మైనస్ అయింది.
0 comments:
Post a Comment