నటీనటులు :
అల్లు అర్జున్ : తన నుంచి ఆశించే ఎనర్జీ కాస్త తక్కువ ఉన్న రోల్ ,సినిమా అంతా సీరియస్ గానే ఉన్నా కొన్ని కామెడి సీన్స్ లో బాగా చేసాడు, అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించాడు
సమంతా టిపికల్ త్రీవి మార్క్ ఇన్నోసెంట్/డంబ్ హీరోయిన్ క్యారెక్టర్, పరవాలేదు . అదా శర్మ రోల్ గెస్ట్ రోల్ టైపు, ఉన్నంత లో కూడా పెద్దగా ఇంప్రెస్స్ చేయలేకపోయింది .
నిత్య మీనన్ కి కొద్దిగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ,ఉన్నంత లో బాగానే చేసింది . స్నేహ బాగుంది, సిందు తులాని, పవిత్ర లోకేష్ ఓకే .
ఉపేంద్ర రోల్ కి బిల్డప్ బాగా ఇచ్చారు కానీ ఆ తరువాత మామూలుగానే ఉంది . రాజేంద్రప్రసాద్ కామెడి తో పాటు కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ ,చాలా బాగా చేశాడు . రావు రమేష్, ఎం స్ నారాయణ ,కోట ఓకే .
అలీ కి చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరికింది, వీలైనంతవరకు నవ్వించాడు ,ముఖ్యంగా ఉపేంద్ర దగ్గర ఇరుక్కునే సీన్ లో . బ్రహ్మి రోల్ షరా మామూలే.
ఎక్కవసేపు కనిపించకపొయినా సినిమా కె మెయిన్ రోల్ లాంటి క్యారెక్టర్ ప్రకాశ్ రాజ్ చేశాడు . ఇంకా బాగా
చేశాడు అని చెప్పుకోవడం వేస్ట్ .
కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: తన తండ్రి చనిపోయాక కూడా ఆయన పాటించే విలువల ని పాటిస్తూ, ఆయన నడిచిన దారి లో బ్రతకాలి అనే ఒక యువకుడు, ఆ దారి లో అతనికి ఎదురయిన సమస్యలే ఈ సినిమా కధ .
చాలా సింపుల్ స్టోరీ లైన్ ,ఫస్టాఫ్ చాలా బాగుంది, ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి, హీరో వెడ్డింగ్ ప్లానర్ అవతారం ఎత్తిన తరువాత కామెడి ని మిక్స్ చేస్తూనే త్రివిక్రమ్ తన మార్క్ డైలాగులతో హీరో క్యారెక్టర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు . ఇంటర్వెల్ దగ్గర రాజేంద్రప్రసాద్ చేత ఉపేంద్ర కి ఇచ్చిన బిల్డప్ భారీగా ఉంది కానీ ఆ అంచనాలకి తగ్గట్టు ఉండదు ఆ క్యారెక్టర్ .చాలా సినిమాల్లో లాగానే ఒకానొక మంచి పని/సాయం చేసినందుకు హీరో ని శభాష్ అనేసి చెల్లిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడిపోతాడు. ఇంక ఆ సమస్యనుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేది కాస్త రొటీన్ ట్రీట్మెంట్ తో లాగించాడు . బ్రహ్మి కామెడీ పరవాలేదు తృప్తి-హాయి-ఆశ్చర్యం సీన్ బ్రహ్మి ట్రాక్ లో బెస్ట్ సీన్ , కానీ ఇంకా ఏదో మిస్ అవుతుంది అని ఫీల్ అయ్యే టైం కి క్లైమాక్స్ దగ్గర మంచి ట్విస్ట్ ఇచ్చి హై నోట్ లో సినిమా ని ఎండ్ చేశాడు .
మొత్తానికి సెకండ్ హాఫ్ నేరేషన్ లో అక్కడక్కడా ఇబ్బందులు ఉన్నా సినిమా ని డీసెంట్ గా ప్రెజంట్ చేయడం లో సక్సెస్ ఐతే అయ్యాడు గానీ, ముందుగానే చెప్పుకున్నట్టు ఉపేంద్ర క్యారెక్టర్ కి ఇంకా స్కోప్ పెంచి హీరో కి దీటుగా నిలబెట్టి ఉంటె సెకండ్ హాఫ్ ఇంకా ఆసక్తికరంగా మారేది . ఓవరాల్ గా కమర్షియల్ సినిమా ఫార్ములా ని మాత్రం బాగా వంటబట్టిచ్చుకున్నాడు .
డైలాగ్స్ : త్రివిక్రమ్ సినిమా అంటేనే ముందుగా గుర్తుకువచ్చేవి డైలాగ్సే , ఆ అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి ఈ సినిమాలో కూడా . రామాయణం , మహాభారతం పురాణాలని సన్నివేశానికి తగ్గట్టు వాడడం
చాలా బాగుంది .
కెమెరా వర్క్ చాలా బాగుంది, ఎడిటింగ్ ఒకే.
దేవిశ్రీ అందించిన పాటలు బాగానే ఉన్నాయి, సూపర్ మచ్చి సాంగ్ అన్ని సాంగ్స్ లోకెల్లా ఎక్కువ రెస్పాన్స్ రాబట్టింది . బాక్ గ్రౌండ్ స్కోర్ పరవాలేదు .
ఫైట్స్ ఒకే .
రేటింగ్ : 6.5/10
చివరగా : అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ నుండి ఆశించే ఎంటర్టైన్మెంట్ కొద్దిగా మిస్ అవడం ,సెకండ్ హాఫ్ లో పలు చోట్ల రొటీన్ ట్రీట్మెంట్ సినిమా కి మైనస్ ,కానీ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ,త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్/ఎమోషనల్ సీన్స్ ,క్లైమాక్స్ సినిమా ని నిలబెట్టాయి
0 comments:
Post a Comment