నటీనటులు : అవును మొదటి భాగం లాగానే ఇందులో కూడా పూర్ణ కి అటు నటన తో పాటు సన్నివేశానికి తగినట్టు గ్లామర్ అందించే పాత్ర, బాగానే చేసింది .
హర్షకి అంత స్కోప్ లేదు కానీ చివర్లో ఆత్మ తనని టార్చర్ పెట్టె సీన్ లో బాగా చేశాడు.రవివర్మ క్యారక్టర్ ఇరిటేట్ చేసిన చివర్లో కధ కి ఉపయోగపడింది. సంజనా రోల్ కి ఇంపార్టెన్స్ లేదు,నికిత ఇంకా మిగతా నటీనటులు పరవాలేదు.
కెమెరా వర్క్ బాగానే ఉంది రవిబాబు మార్క్ కనిపిస్తుంది.ఎడిటింగ్ పరవాలేదు,నిడివి తక్కువే అయినా బోర్ కొట్టింది కొన్ని అనవరస సన్నివేశాల వల్ల.మొదటి భాగం లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవును కి చాలా హెల్ప్ అయింది కానీ ఈ సారి అలా కుదరలేదు ,పసలేని సీన్స్ కి తోడు లౌడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టార్చర్ పెట్టినంత పని చేసింది.
కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బేసిక్ గా అవును సెకండ్ పార్ట్ కి అతి పెద్ద మైనస్ పాయింట్ వచేసి సరైన కధ లేకపోవడం. అవును లో ఉన్న సస్పెన్స్ కానీ హారర్ ఎలిమెంట్స్ ఇందులో కంప్లీట్ గా మిస్ అయ్యాయి. కొత్తగా చూపించడానికి ఏమీ లేదు తిప్పి తిప్పి అవే సీన్స్ వస్తుంటాయి .తరువాత ఎం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ ఏ లేనపుడు ఇంకా ఎం సస్పెన్స్ క్రియేట్ అవుతుంది.ఆత్మ ఉంది అని తెలియడానికి ఇంటర్వల్ వరకు టైమ్ తీసుకున్నాడు. అంతకుముందు పెద్దగా ఆకట్టుకునే సీన్స్ ఏమీ లేదు ముందుగానే చెప్పుకున్నట్టు ,ఆత్మ గురించి ఆ రీసెర్చి చేసే సీన్స్ శుద్ధ వేస్ట్, నిడివి పెరగడినికి తప్ప ఎందుకు ఉపయోగపడలేదు.సెకెండ్ హాఫ్ లో ఆత్మ ఉంది అని తెలిశాక ఐన కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగుతుందా అంటే అధి లేదు.అట్టాక్ సీన్స్ సినిమా నిండా ఉన్నవే మళ్లీ క్లైమ్యాక్స్ లో కాస్త ఎక్కువ సేపు అంతే, హర్శ.,మోహినీ అంటూ అరుపుల తో సాగతీసాడు.చివర్లో రవివర్మ,నికిత ట్ర్యాక్ లో వక్చే ట్విస్ట్ ఒక్కటే సినిమా లో కాస్త చెప్పుకోదగిన పాయింట్.అసలు ఫర్స్ట్ పార్ట్ ఎక్కడ ఆగిపొియిందో అక్కడే ఆ కధ ముగిసిపోయింది ,అంతటి తో ఆ కధ ని వదిలేయక మళ్లీ అదే కధ ని బలవంతంగా తీసినట్లు ఉంది.దానికి బదులు అలాంటి కధ నే ఇంకో బ్యాక్డ్రాప్ లో కొన్నిమార్పుల తో తీసి ఉంటే హారర్ సీన్స్ కి చాన్స్ అన్న ఉండేది.చివర్లో మళ్లీ అవును మూడో భాగం హింట్ వదిలాడు కానీ మళ్లీ జనాలు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచు.
రేటింగ్ :4/10
చివరిగా :అవును 2 అని చెప్పి అవును సినిమానే మళ్లీ తీశాడు,కావాలంటే ఆ అవును సినిమానే మళ్లీ టీవీ లేదా డీవీడీ లో చూడండి,ఈ సినిమాని చూడాల్సిన అవసరం ఉండదు.
0 comments:
Post a Comment