రివ్యూ: గీత గోవిందం
బ్యానర్: జిఏ 2 పిక్చర్స్
తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నాగబాబు తదితరులు
సంగీతం: గోపి సుందర్
కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
ఛాయాగ్రహణం: మణికండన్
నిర్మాత: బన్నీ వాస్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పరశురాం
కధ-కధనం-విశ్లేషణ:
చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల డిస్టర్బ్ అయిన ఒక ప్రేమ జంట ప్రయాణం ఎలా ఒక కొలిక్కి వచ్చింది అన్నదే "గీత గోవిందం" కధ.
దర్శకుడు పరశురామ్ తీసుకున్నది చాలా చిన్న స్టోరీ లైన్ యే , కధనం కూడా ఊహించ దగ్గ శైలి లోనే సాగుతుంది. ఐతే హీరో-హీరోయిన్ ల క్యారెక్టర్స్/కెమిస్ట్రీ ,వాళ్ళిద్దరి మధ్య ముఖ్యమైన సన్నివేశాలు అలాగే సిట్యుయేషనల్ ఫన్ వర్కౌట్ అయ్యేలా చూడడం లో సక్సెస్ అయ్యాడు.
మొదట హీరో పరిచయం.. ఆ బ్యాక్ డ్రాప్ ని సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు చాలా తొందర గానే మెయిన్ పాయింట్ ని టచ్ చేసి, హీరో ని ఇరుకు లో పడేసి, ఆ పై హీరో-హీరోయిన్ ఖచ్చితంగా కలిసే సమయ గడిపేలా లాక్ వేస్తాడు.ఆ ప్రాసెస్ లో హీరోయిన్ పెట్టె ఇబ్బందుల ని ఎదుర్కుంటూ హీరో పడే ఇక్కట్ల తో వీలయినంత వినోదం పండుతుంది. అతన్ని క్యారెక్టర్ పై హీరోయిన్ డౌట్ పడే సన్నివేశాల్లో సిట్యుయేషన్ "అర్జున్ రెడ్డి' తో విజయ్ కి ఉన్న ఇమేజ్ కి కాంట్రాస్ట్ గా ఉండడం భలే వర్కౌట్ అయింది.
ఇక ఈ తరహా సినిమాల్లో ఎప్పడూ ఉండే లాగే ఫస్ట్ హాఫ్ సాగినంత వేగంగా సెకండ్ హాఫ్ సాగదు. హీరోయిన్ అన్నయ్య హైదరాబాద్ వచ్చే ఆ ఎపిసోడ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఐతే ఒక్క సీన్ తో హీరోయిన్ కి హీరో మీద ఉండే అభిప్రాయం మారిపోయే ఎపిసోడ్ బాగుంది. ఆ క్రమం లో వచ్చే "ఏంటి ఏంటి" సాంగ్ కూడా చాలా బాగుంది. ఐతే అంతే బలంగా ఇద్దరి మధ్య దూరం పెరిగే సన్నివేశాన్ని రాసుకోలేకపోయాడు దర్శకుడు.
సరిగ్గా సినిమా నడక కాస్త భారంగా సాగుతున్న సమయం లో "అమెరిగా పెళ్ళికొడుకు" తరహా పాత్ర లో వెన్నెల కిశోర్ ఎంట్రీ తో అతడి క్యారెక్టర్ ని కన్వీనియంట్ గా మెయిన్ ట్రాక్ కి లింక్ చేసి ఎంటర్టైన్ చేస్తాడు. ఎమోషనల్ టచ్ ఇచ్చినట్టే ఇచ్చి చివర్లో మళ్ళీ కామెడీ రూట్ లో వెళ్లి క్లైమాక్స్ ని ముగించడం బాగుంది.
విజయ్ దేవరకొండ గోవింద్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇన్నోసెన్స్ తో పాటు ఫన్నీ గా ఉండే క్యారెక్టర్ లో ఉండే పాత్ర లో ఆద్యంతం అలరించాడు. అలాగే గీత పాత్ర లో కూడా రష్మిక అదరగొట్టింది. వాళ్లిద్దరూ నటన తో పాటు పెయిర్ గా కూడా చాలా బావున్నారు.
ఇక కామెడీ డోస్ అందించడం లో రాహుల్ రామక్రిష్ణ, వెన్నెల కిశోర్ అండ్ కో వీలయినంత సక్సెస్ అయ్యారు. సుబ్బరాజు, అన్నపూర్ణ తదితరులు ఆయా పాత్రలకి సరిపోయారు.
గోపి సుందర్ అందించిన పాటలు సినిమా ఫ్లో లో కలిసిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరవాలేదు.
ముందుగానే చెప్పుకున్నట్టు దర్శకుడు పరశురామ్ ఎంచుకున్న కధ,కధనాలు తెలిసిన దారి లోనే వెళ్లినా,లీడ్ పెయిర్ ద్వారా మంచి నటన తో పాటు ఎంటర్టైన్మెంట్ వర్కవుట్ అయ్యేలా చూసుకోవడం లో సక్సెస్ అయ్యాడు.
రేటింగ్: 60/100
0 comments:
Post a Comment