నటీనటులు: సుమంత్ అశ్విన్ కి మంచి క్యారెక్టర్ దక్కింది, అతని నటన కూడా బాగుంది. విశ్వనాధ్ జస్ట్ ఒకే , ముఖ్యమైన సన్నివేశాల్లో కూడా అతని సాధారణ స్థాయిలోనే ఉంది. పార్వతీశం క్యారెక్టర్ కొన్ని చోట్ల లౌడ్ అయినా ఓవరాల్ గా ఆకట్టుకుంటాడు. సుకృతి నాచురల్ పెర్ఫార్మన్స్ తో అందరిలోకెల్లా మంచి మార్కులు కొట్టేసింది, శ్రీ దివ్య ,తేజస్విని పరవాలేదు.
కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: నలుగురు స్నేహితుల మధ్య నడిచే కధ, యూత్ ని టార్గెట్ చేసిన సినిమాలకి కమర్షియల్ సినిమాలకి ఉన్నట్టే ఒక ఫార్ములా ఉంటుంది, కేరింత కూడా ఆ ఫార్ములాకి లోబడి తీసిన సినిమానే. కొన్ని సన్నివేశాలు,పాత్రలు "హ్యాపీ డేస్ " వంటి సినిమాలని గుర్తుకుతెచ్చినా ఆ పోలిక అంతవరకే. కేవలం కాంపస్ లైఫ్ మీదే కాన్సెంట్రేట్ చేయకపోవడం కేరింత సినిమాకి ప్లస్ పాయింట్. అయితే సినిమా టేకాఫ్ ఇంకా బాగుండాల్సింది, క్యారెక్టర్స్ ని హఫ్ వే లో ఓపెన్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది, ముందుగా చెప్పుకున్నట్టు ఆల్రెడీ తెలిసున్న కధే అయినపుడు ఆడియన్స్ క్యారెక్టర్స్ తో ఎంతగా కనెక్ట్ అయ్యారన్న దానిమీదే సినిమా సక్సెస్ డిపెండ్ అవుతుంది. ఈ లోపాల వల్లే కేరింత ఔట్పుట్ నెక్స్ట్ లెవెల్ ని రీచ్ కాలేకపోయింది. అలాగని మరీ తీసిపారేసే సినిమా కూడా కాదు. సినిమా మొదటినుంచి చివరివరకు కధనం ఊహించినట్టే సాగినా కధలో మలుపులు/సమస్యలు తొందరగానే రావడం, ఆ సమస్యలనుంచి బయటపడే క్రమంలో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ అవడం వల్ల ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ మీద డిపెండ్ అయితే ,ఇంటర్వెల్ నుండి ఎమోషనల్ టర్న్ తీసుకుని కావాల్సిన ఎమోషన్ ని మరీ మోతాదు మించకుండా అలాగే తక్కువ కాకుండా అందిస్తూ గమ్యం చేరుకుంటుంది సినిమా. మొత్తానికి దర్శకుడు సాయి కిరణ్ అడివి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తీయడం లో సక్సెస్ అయ్యాడు కానీ రచనా దశలోనే మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే కేరింత మరింత బాగుండేది.
డైలాగ్స్ నాచురల్ గా బాగున్నాయి, మిక్కి జే మేయర్ సంగీతం లో పాటలు బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు.
రేటింగ్: 6/10
చివరిగా: కేరింత - మంచి టైం పాస్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.
0 comments:
Post a Comment