నటీనటులు: అలవాటైన పాత్రలో రామ్ నటన ఒకే , రకుల్ ప్రీత్ సింగ్ అందంగా ఉంది , సోనాల్ చౌహన్ ఒకే ఒక్క పాటలో ఎక్స్‌పోజింగ్ తో తన ఉనికిని చాటుకుంది. బ్రహ్మి లెంగ్త్ ఎక్కువ ఉన్న రోల్ చేసినా అక్కడక్కడా మాత్రమే నవ్వించాడు. సంపత్ రాజ్ ఒకే , సాయి కుమార్ ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. వెన్నెల కిశోర్ పర్వాలేదు , ఎం ఎస్ నారాయణ కామెడీ లో బూతు ఎక్కువైంది. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ సినిమాల తరహ లో తెర పై చాలామంది నటీనటులు ఉన్న వాళ్ళకి సరైన స్కోప్ లేదు.
కధ- స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: హీరో ఒక కారణం తో రెండు కుటుంబాల/ఊళ్ళ మధ్య ఉన్న శత్రుత్వాన్ని అంతం చేసి కలపడం అనే స్టొరీ లైన్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిందే. రెడీ సినిమా నుంచి ఈ తరహ సినిమాల జోరు మరింత ఎక్కువయింది. అయితే ఎంత రొటీన్ కధ అయినా , కామెడి లో,సెంటిమెంట్ లో ఎక్కడో ఒక చోట కొత్తదనం లేదా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే స్క్రీన్‌ప్లే ఉంటేనే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం సాధ్యం అవుతుంది. పండగ చేస్కో సినిమాలో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కి కావాల్సిన అన్ని ఎలి మెంట్స్ ఉన్నా స్క్రీన్‌ప్లే లో ఉన్న లోపాల వల్ల అవుట్పుట్ యావరేజ్ మార్క్ ని దాటలేకపోయింది. ఇంటర్వెల్ బాంగ్ లో షాక్ వాల్యూ కోసం కధంతా దాచిపేట్టేయటం తో ఫస్టాఫ్ మరీ డల్ గా తయారయింది. ఫారెన్ నుంచి ఇండియా కి షిఫ్ట్ అయ్యాక కాస్త పరవాలేదు అనిపిస్తుంది కాని స్ట్రాంగ్ బేస్ లేని కారణంగా లవ్ ట్రాక్ వీక్ అయిపోయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ తరువాత సెకండ్ హాఫ్ లో అన్నా సినిమా ట్రాక్ లో పడుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తే అదీ జరగలేదు,హీరో తన గోల్ రీచ్ అవడం కోసం వేసే ఎత్తులు అన్నీ మనకి ముందే తెలిసిపోతుంటాయి. బ్రహ్మి ని మంచి బాంగ్ తో గేమ్ లో కి ఎంటర్ చేయించినా తరువాత సోనాల్ చౌహన్ ని చూసి సొంగ కార్చటానికే వాడుకోవడం వలన పెద్దగా ఉపయోగం లేకపోయింది ఆ పాత్ర వల్ల. అయితే కొన్ని చోట్ల పంచ్ లు బాగా పేలాయి ,అలాగే హీరోయిన్ చెంప దెబ్బని ముద్దులా ఫీల్ అవడం అన్న కాన్సెప్ట్ కూడా బాగానే నవ్వించింది. కాకపోతే క్యారెక్టర్స్ అన్నిటినీ గుంపులో గోవిందా టైపులో ఉంచి కామెడీ మీద కాన్సెంట్రేట్ చేయడం, ఆ కామెడీ ఆర్డినరీ గానే ఉండడం వల్ల క్లైమాక్స్ కి కావాల్సిన ఎమోషన్ కంప్లీట్ గా మిస్ అయింది.
కోన వెంకట్ మాటలు పరవాలేదు, తమన్ సంగీతం లో రెండు పాటలు బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ వీక్ గా ఉంది. కెమెరా వర్క్ బాగుంది, ఎడిటింగ్ పరవాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ అంతంత మాత్రమే, లీడ్ సీన్ లో ఎమోషన్ వర్కౌట్ కాకుంటే ఎంత బిల్దప్ ఇచ్చినా వేస్టే.
రేటింగ్: 5/10
చివరిగా: ఈ టైపు కామెడీ ఫార్ములా లవర్స్ అయితే ఎలాగోలా పండగ చేసుకుంటారు కానీ కాస్తైనా కంటెంట్/కొత్తదనం ఆశించే వారికీ దండగ ఖర్చు.
0 comments:
Post a Comment