కధ : చందు (నాగ చైతన్య ) చిన్న చిన్న మోసాలు ,దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో తన చెల్లెలిని మెడిసిన్ చదివిస్తూ ఉంటాడు ,అదే కాలేజి లో చదివే మీరా (క్రితి సనన్ ) తో ప్రేమ లో పడతాడు . ఇదిలా ఉండగా తన తండ్రి(రావు రమేష్ )ని జైలు నుంచి విడుదల చేయించడానికి 2 కోట్లు అవసరమవుతాయి చందు కి . అయితే అనుకోని పరిస్థితుల్లో మాణిక్యం (పోసాని) కి చెందిన డబ్బు చందు చేతికందుతుంది . ఆ డబ్బు వాళ్ళ చందు ఎదుర్కున్న సమస్యలేంటి ,అసలు చందు కి, మాణిక్యం కి ఉన్న లింక్ ఏంటి అనేది మిగతా కధ .
నటీనటులు : చందు గా నాగ చైతన్య ఒకే ,ఆ పాత్ర కి ఉండాల్సిన ఆటిట్యూడ్ మిస్ అయింది తన పెర్ఫార్మన్స్ లో, ఐతే తన లుక్స్ పరంగా డైరెక్టర్ మంచి జాగ్రత్తలే తీసుకున్నాడు . కృతి సనన్ కి పెద్ద పాత్ర లేకపోయినా , తన నవ్వుతో ,అందం తో ఆకట్టుకుంది . పోసాని కామెడి విలన్ గా సరిపోయాడు . అవినీతి పరుడైన పోలీస్ పాత్ర లో రవిబాబు పరవాలేదు . హీరో ఫ్రెండ్స్ గా సత్య , ప్రవీణ్ లు ఓకే . అలాగే విలన్ అనుచరులు గా viva హర్ష ,భాను లు కూడా . బులెట్ బాబు గా బ్రహ్మి బాగానే నవ్వించాడు .
కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : కధ కొత్తదేమీ కాదు , అరిగిపోయిన రివెంజ్ లైన్ ని తనదైన క్రైమ్ కామెడి స్టైల్ లో తీసాడు సుదీర్ వర్మ . తొలి చిత్రం "స్వామి రా రా " లోనూ పెద్ద కధ లేకపోయినా ఆకట్టుకునేలా తెరకెక్కించడం లో సఫలమయ్యాడు . అయితే ఆదే ఫీట్ ని ఈ సరి రిపీట్ చేయలేకపోయాడు . అక్కడక్కడా మాత్రమే తన మార్కు మెరుపులు ఉన్నాయి . ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ,హీరోయిన్ తో లవ్ ట్రాక్ వగైరా సన్నివేశాలతో ఎంటర్టైనింగ్ గానే సాగుతుంది కధనం , ఇంటర్వెల్ ట్విస్ట్ తో కూడా పూర్తిగా కధ లో కి రాదు , సెకండ్ హాఫ్ లో రివెంజ్ యాంగిల్ రివిల్ అయ్యాక ఇక హీరో కి అసలైన సమస్య ఎదురుపడింది ,సరైన ట్రాక్ లో కి వెళ్తుంది అనుకుంటే ,హీరో - విలన్ గేమ్ కి తేర దించకుండా సాగదీసాడు . రవిబాబు రోల్ కి హీరో ట్విస్ట్ ఇచ్చే సీన్ బాగుంది కానీ, ఆ పాత్ర ని అంతసేపు లాగడం వలన ఆ ఎఫెక్ట్ లేదు ఆ ఎపిసోడ్ లొ. ఇంక ఈ మద్య ట్రెండ్ ని ఫాలో అయి ప్రీ క్లైమాక్స్ లో బ్రహ్మి ని రంగం లోకి దించాడు , ఆ ట్రాక్ పరవాలేదు బాగానే నవ్వించింది . క్లైమాక్స్ లో విలన్ పని పట్టడానికి కామెడీ రూట్ ని ఎంచుకోవడం అంతగా బాగోలేదు . అవతల హీరోకి అంత తక్కువ డెడ్ లైన్ కి తోడు రివెంజ్ యాంగిల్ ఉన్నప్పుడు హీరో కి విలన్ కి మద్య గేమ్ ని కామెడీ రూట్ లో హండిల్ చేయడం కరెక్ట్ కాదు ,విలన్ పరిచయ సన్నివేశాల్లో కామెడీ ఉన్నా ,ఆ పాత్ర కామెడీ అవలేదు కానీ క్లైమాక్స్ లో అదే తప్పు జరిగింది . మొత్తానికి ముందుగానే చేపుకున్నట్టు దర్శకుడు సుదీర్ వర్మ కొన్ని చోట్ల తనదైన స్టైల్ లో థ్రిల్ చేసినా తన తోలి చిత్రం తో తనకు తానే సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ ని రీచ్ అవలేకపోయాడు .
మాటలు : బాగున్నాయి
సంగీతం : సన్నీ ఎం ఆర్ సంగీతం ఒకే ,అవే పాటలు రిపీట్ అయిన ఫీలింగ్ కలిగింది , ఆనాటి దేవదాసు సాంగ్ మాత్రం బాగుంది . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది .
కెమెరా : రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది .
ఎడిటింగ్: సెకండ్ ఇంకా హాఫ్ లో ఇంకా బెటర్ గా ఉండాల్సింది .
రేటింగ్ : 5.5/10
చివరిగా : డీసెంట్ ఫస్ట్ హాఫ్ ,కామెడీ బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ ,స్క్రీన్ ప్లే మీద కేర్ తీసుకుని ఉంటే "దొచెయ్ " మరింత ఆసక్తికరంగా తయారయ్యేది . ఆ లోపాల వల్ల ఫ్రెష్ నెస్ /ఉండాల్సిన ఇంట్రెస్ట్ మిస్ అయి ఒక మామూలు టైం పాస్ సినిమా గా మిగిలిపోయింది .
0 comments:
Post a Comment