భరత్ అనే నేను రివ్యూ




   Image result for bharath ane nenu wallpapers



చిత్రం : ‘భరత్ అనే నేను’ 

నటీనటులు: మహేష్ బాబు - కియారా అద్వాని - ప్రకాష్ రాజ్ - శరత్ కుమార్ , దేవరాజ్ - రవిశంకర్ - ఆమని - సితార - బ్రహ్మాజీ - రావు రమేష్ - పోసాని కృష్ణమురళి - పృథ్వీ - రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: తిరు - రవి.కె.చంద్రన్
నిర్మాత: డీవీవీ దానయ్య
రచన - దర్శకత్వం: కొరటాల శివ 



కమర్షియల్ అంశాలు ఉంటూనే ఏదో ఒక మంచి సందేశాన్ని కధకి జోడించి చెప్పడం దర్శకుడు కొరటాల శైలి. మహేష్- తో "శ్రీమంతుడు" లాంటి సినిమా తరువాత మళ్ళీ అలాంటి ఫార్ములా తోనే "భరత్ అనే నేను" తో మన ముందుకు వచ్చాడు.

స్థూలంగా కధ గురించి చెప్పుకోవాలంటే అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన ఒక యువకుడి ప్రయాణం... ఆ క్రమంలో అతను ఎదుర్కున్న పరిస్థితులు, చేపట్టిన మార్పులు/నిర్ణయాలు.


ఎంచుకున్న పాయింట్ ఎలాంటిదైనా దాన్ని తనదైన సింప్లిసిటీ తో,కాస్త నెమ్మదిగా నడిపించే కొరటాల ఈ సారీ అదే రూట్ లో వెళ్ళాడు. ఫస్టాఫ్ మొదటి ఇరవై నిముషాలు మరీ నెమ్మదిగా సాగుతుంది. హీరో సీఎం గా ఛార్జ్ తీసుకున్నాకే ఊపందుకుంటుంది కధనం. ఒక్కొక్కటిగా హీరో తీసుకునే నిర్ణయాలు వాటిని అమలు పరిచే విధంగా నడుచుకునే తీరుని పవర్ఫుల్ గా చూపించి ఆకట్టుకుంటాడు దర్శకుడు. ప్రధాన కధ నుండి డీవియేట్ కాకుండా లవ్ ట్రాక్ ని బాగానే హ్యాండిల్ చేసాడు. ఆ ట్రాక్ లో అవకాశం ఉన్నా కూడా అవసరానికి మించి ఎక్కువ సన్నివేశాలకి ప్రయత్నించకుండా ఉండడం బాగుంది. ఊహించినట్టుగానే సీఎం చేసే మంచి పనులకి అడ్డంకులు..శత్రువులు ఎదురవ్వడం,ఒక టిపికల్ వార్నింగ్ సీన్ అయినా మంచి ఇంటెన్సిటీ తో ముగుస్తుంది ఫస్టాఫ్.

ఫస్టాఫ్ పెంచిన అంచనాలని అందుకోవడం లో కాస్త తడబడ్డా.. సెకండాఫ్ లోనూ మంచి సన్నివేశాలకి కొదవ లేదు. రాయలసీమ నేపథ్యం లో వచ్చే ఎపిసోడ్ లో దుర్గ మహల్ ఫైట్ తో హీరోయిజం ని పీక్స్ లో ఎలివేట్ చేసిన కొరటాల.. అంతే బలంగా వచ్చాడయ్యో సామీ పాటను ప్రెజంట్ చేయలేకపోయాడు. ఆ తరువాత సీఎం ఊరూరా తిరిగి అక్కడ సమస్యలని పరిష్కరించే నేపధ్యం లో కాస్త డౌన్ ఐన సినిమా ప్రెస్ మీట్ సీన్ తో మళ్ళీ ట్రాక్ లో పడుతుంది. ప్రస్తుత మీడియా ప్రవర్తనకు అతికినట్టు సరిపోయే ఆ సీన్ అద్దిరిపోయే రెస్పాన్స్ ని రాబట్టింది. సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడే ప్రతి ఒక్కరూ మొట్ట మొదట మాట్లాడుకునే సీన్ అది.


‘ఐయామ్ నాట్ డన్ యెట్’ అంటూ బాధని,ఆవేశాన్ని చూపించి మహేష్ తనదయిన ఇంటెన్సిటీ తో ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. మొదట్లో ఇది మరొక టెంప్లేట్ సింపుల్ క్యారెక్టర్ లాగా అనిపించే భరత్ రామ్ పాత్ర/అందులో మహేష్ నటన సినిమా ముందుకు కదులుతున్న కొద్దీ ఆ ఇంప్రెషన్ ను పూర్తిగా పోగొడుతుంది. కియారా అద్వానీ బాగుంది.. ఉన్నంతలో బాగానే నటించింది. ప్రకాష్ రాజ్ కి చాలా కాలానికి మంచి పాత్ర లభించింది. మొదట్లో మామూలుగానే కనిపించినా కీలక సన్నివేశాల్లో తన నటనతో ఆ పాత్ర పరిధిని పెంచేసాడు. ఇక రావు రమేష్ కూడా తన  ప్రెజన్స్ ఫీల్ అయ్యేలా చేసాడు. రవిశంకర్,పోసాని కృష్ణమురళి,దేవరాజ్,శరత్ కుమార్ ,సితార,బ్రహ్మాజీ తదితరులు ఆయా పాత్రలకు సరిపోయారు.


దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కి ఖచ్చితంగా ప్లస్ అని చెప్పచ్చు. ప్రధాన పాత్రని నడిపించిన తీరుతో దర్శకుడు తనకు తానే సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ కి క్లైమాక్స్ రీచ్ అవలేదు. కొరటాల మరో సారి సినిమాని ముగించడం లో తడబడ్డాడు.చివర్లో ఈ లోపాలని మినహాయిస్తే దర్శకుడి గా తనదైన ముద్ర వేయడం లో సక్సెస్ అయ్యాడు.


రేటింగ్: 68/100  
Share on Google Plus

About aditya

Hai i am Aditya, a die hard telugu cinema fan and Critic,I watch almost all the telugu released on the first day and i will share my review in this blog

0 comments:

Post a Comment