కాటమరాయుడు రివ్యూ

Image result for katamarayudu wallpapers






చిత్రం: ‘కాటమరాయుడు’ 

నటీనటులు: పవన్ కళ్యాణ్ - శ్రుతి హాసన్ - నాజర్ - ఆలీ - అజయ్ - శివబాలాజీ - కృష్ణచైతన్య - కమల్ కామరాజు - తరుణ్ అరోరా - మహేంద్రన్ - రావు రమేష్ - ప్రదీప్ రావత్ - పృథ్వీ - నాజర్ - పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
కథ: భూపతి రాజా - శివ
మాటలు: శ్రీనివాస్ రెడ్డి
స్క్రీన్ ప్లే: వాసు వర్మ - దీపక్ రాజ్ - కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ)
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ)



కథ: 

కాటమరాయుడు (పవన్ కళ్యాణ్) రాయలసీమలో ఒక ఊరికి పెద్ద. అతడికి నలుగురు తమ్ముళ్లు. చిన్నతనం నుంచి వాళ్లను కష్టపడి పెంచి పెద్ద చేస్తాడు కాటమరాయుడు. తమ్ముళ్లంటే అతడికి ప్రాణం. తమ్ముళ్లకు అతనంటే ప్రాణం. ఐతే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై అక్రమార్కుల పని పట్టే కాటమరాయుడికి శత్రువులూ ఎక్కువే. అమ్మాయిలకు ఆమడదూరంలో ఉండే కాటమరాయుడికి అవంతి (శ్రుతి హాసన్)తో ముడిపెడతారు అతడి తమ్ముళ్లు. రాయుడి తమ్ముళ్లు చెప్పిన అబద్ధాల్ని నమ్మి.. మరికొన్ని కారణాలతో అతణ్ని ప్రేమిస్తుంది అవంతి. రాయుడు కూడా ఆమెను ప్రేమిస్తాడు. కానీ అవంతి అనుకున్నట్లుగా కాటమరాయుడు శాంతి కామకుడేమీ కాదని తనకు తెలుస్తుంది. అప్పుడు ఆమె ఏం చేసింది.. అవంతి కోసం కాటమరాయుడు మారాడా.. చివరికి వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ: 

కధ చాలా పాతది. దశాబ్దాల నుంచి అరిగిపోయిన కధని మళ్ళీ తమిళం నుండి తెలుగులోకి డబ్ అయిన "వీరం" చిత్రాన్ని పవన్ వరకు కొంచెం కొత్తగానే ఉంటుంది అని సెలెక్ట్ చేసుకుని ఉండచ్చు. ఐతే పవన్ ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులైతే చేశారు కానీ, సినిమాని పూర్తిగా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించడం లో సఫలం అవలేదు.

ముందుగానే చెప్పుకున్నట్టు పాత కధే  అయినా, హీరో క్యారెక్టర్ ని సరైన విధంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే , హీరోయిజం పండించే సన్నివేశాలు చాలానే వచ్చేవి. ఐతే కేవలం హీరో ఇంట్రో ఎపిసోడ్, మళ్ళీ సెకండాఫ్ లో స్కూల్ డాక్యుమెంట్ లు తిరిగి సంపాదించే సీన్ లో మాత్రమే ఆ స్థాయి లో హీరోయిజం పండింది. మిగతా సినిమా లో మళ్ళీ ఎక్కడ హీరో ని అంత పవర్ఫుల్ గా ప్రెజంట్ చేయలేదు.

ఫస్టాఫ్ రొటీన్ గానే ఉన్నా బోర్ కొట్టదు. పవన్-శృతి మధ్య రొమాన్స్ ట్రాక్ బాగానే ఉంది.. అక్కడక్కడా తమ్ముళ్లు,అలీ కామెడీ తో పాటు పవన్ ప్రేమ లో పడే క్రమం లో వచ్చే మాంటేజ్  సాంగ్ , లవ్ ప్రపోజ్ చేసే సీన్ బాగా వచ్చాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ టిపికల్ గా  అనిపించినా , నిజానికి సినిమా కి అది బలమైన సన్నివేశం కావాల్సింది. ఐతే ఆ ఫైట్ లో గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఘోరంగా ఫెయిల్ అవడం తో పూర్తిగా తేలిపోయింది. సెకండాఫ్  పవన్-శృతి,నాజర్ ల మధ్య ఫన్నీ సీన్స్ తో బాగానే ఓపెన్ అవుతుంది. అలీ & గ్యాంగ్ హీరోయిన్ ఇంట్లో కి ఎంట్రీ ఇవ్వడం ,పృద్వి పాత్ర తొ కామెడీ పరవాలేదు. ఆ తరువాత  విలన్ ఫ్లాష్ బ్యాక్ తో రొటీన్ ట్రాక్ లో వెళుతుంది. పవన్ పాపతో దాగుడు మూతలు ఆడుతూ రౌడీ లతో  ఉండే ఫైట్ బాగుంది . ప్రీ క్లైమాక్స్ మరీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, క్లైమాక్స్ ఫైట్ ఇంకా బాగా ఉండాల్సింది.

హీరో కి ఎదురు నిలబడే ధీటైన విలన్స్ లేకపోవడం,హీరో,హీరోయిన్ ఫ్యామిలీ  మీద సింపతీ వచ్చే లా బలమైన సన్నివేశాలు లేకపోవడం తో అతను చేస్తున్న పోరాటం తాలూకు ఇంటెన్సిటీ పూర్తిగా మిస్ అయింది ,ఫార్ములా/మాస్ మూవీ లవర్స్ ని ,ఫాన్స్ ని  ఐతే కాటమరాయుడు అంతో ఇంతో అలరిస్తుంది ,అలా కాకుండా కాస్తైనా కొత్తదనం కోరుకునేవాళ్ళకి నిరుత్సాహం తప్పదు.


నటీనటులు:

టైటిల్ రోల్ లో పవన్ బాగున్నాడు, లుక్ తో పాటు అతని నటన కూడా పర్ఫెక్ట్ గా  ఉంది, ఎలేవేషన్ సీన్స్ లో అయినా, కామెడీ సీన్స్ లో అయినా,హీరోయిన్ తో రొమాన్స్ విషయంలో తన మార్క్ నటన తో ఆకట్టుకున్నాడు. శృతి హాసన్ ది  ఇంపార్టెంట్ రోల్ అయినా  పెర్ఫార్మన్స్ కి అంత స్కోప్ లేదు, పైగా పాటల్లో ఆమె డ్రెస్సింగ్ వల్ల  చాలా ఆడ్ గా కనిపించింది. తమ్ముళ్ళు గా నటించిన వాళ్లలో అజయ్ ఆకట్టుకున్నాడు. శివ బాలాజీ, చైతన్య కృష్ణ ,కమల్ కామరాజు ఒకే. అలీ కామెడీ పరవాలేదు.పృథ్వి కూడా ఒకే, విలన్స్ గా  ప్రదీప్ రావత్ , తరుణ్ అరోరా సరిపోయారు. రావు  రమేష్ పాత్ర మొదట్లో ఆసక్తికరంగా అనిపించినా తరువాత తేలిపోయింది.


సాంకేతికవర్గం:

డైలాగులు బాగానే ఉన్నాయి. కెమెరా/ఎడిటింగ్ వర్క్ ఒకే. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఒక మాస్ సినిమా కి తగ్గ సాంగ్స్ ఇవ్వడం లో అనూప్ రూబెన్స్ ఫెయిల్ అయ్యాడు. టైటిల్ సాంగ్, ఎలో ఎడారి లో సాంగ్ పరవాలేదు. ఇంక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఐతే చాలా దారుణం, రొమాన్స్ ట్రాక్ లో ఒకటి రెండు సన్నివేశాలు మినహామిగతా  సినిమా లో ఎక్కడా బాగోలేదు.


రేటింగ్ : 5/10

Share on Google Plus

About aditya

Hai i am Aditya, a die hard telugu cinema fan and Critic,I watch almost all the telugu released on the first day and i will share my review in this blog

0 comments:

Post a Comment